24 గంటల్లో 2 కోట్ల 14 లక్షలు లైకులు

Thu Oct 12 2017 11:25:47 GMT+0530 (IST)

ఈ రోజుల్లో సినిమా హిట్టా ఫట్టా అన్నది తర్వాత సంగతి. ఆ సినిమా విడుదలకు ముందు ఏ స్థాయిలో సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుందా అన్నదే ముఖ్యం. ఈ రోజుల్లో ఏ సినిమా అయినా విడుదల అయిన మొదటి  ఏడు రోజులనే టార్గెట్ చేస్తోంది. వారం మొత్తం హౌస్ కలెక్షన్స్ ఉండాలంటే వారి ఆయుధం ఒక్క ట్రైలర్ మాత్రమే. రెండు నిమిషాల ట్రైలర్ లోనే భారీ కలెక్షన్స్ ఉంటాయని ఈ రోజుల్లో దానిపైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు.ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రైలర్ ల హవా మాములుగా ఉండడం లేదు. సినిమా ఎన్ని రికార్డులు తిరగరాస్తుందో తెలియదు గాని ట్రైలర్ టీజర్స్ మాత్రం గంటకొక రికార్డును నమోదు చేస్తున్నాయి. అయితే రీసెంట్ గా విడుదలైన బాలీవుడ్ సోషియే ఫాంటసీ మూవీ 'పద్మావతి' ట్రైలర్ యూ ట్యూబ్ లో రికార్డును సృష్టించింది.  విడుదలైన 24 గంటల్లోనే రెండు కోట్ల 14 లక్షల మందికి పైగా వీక్షించారు. బాహుబలి 2 హిందీ వెర్షన్ కూడా ఇదే స్థాయిలో సంచలనాన్ని సృష్టించింది.

దీంతో సినిమాపై ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో అర్ధమవుతోంది. ఇప్పటికే దర్శక దిగ్గజాల మన్ననలను అందుకుంటోంది. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రముఖ దర్శకుడు సంజయ్ లీల బన్సాలి సినిమాను తెరకెక్కిస్తున్నాడు. టైటిల్ రోలో దీపికా పదుకొనె నటించనుండగా రణ్‌వీర్ సింగ్ - సుల్తాన్ అల్లా ఉద్దీన్ ఖిల్జి పాత్రలో అండ్ షాహిద్ కపూర్ మహారావల్ రతన్ సింగ్ పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. డిసెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.