Begin typing your search above and press return to search.

300 కోట్ల సినిమా.. అమెజాన్ లో వచ్చేస్తోంది

By:  Tupaki Desk   |   21 March 2018 11:30 PM GMT
300 కోట్ల సినిమా.. అమెజాన్ లో వచ్చేస్తోంది
X

చారిత్రాత్మక సినిమాలు చేయడంలో సంజయ్ లీలా భన్సాలీని కొట్టిన వారు లేరు. అది బాజిరావు మస్తాని అయినా, పద్మావత్ అయినా, ఆయన రూటే సెపరేటు. ఆయన సినిమాలలో ప్రేమకు పెద్ద పీట ఉంటుంది. మొహమ్మద్ సూఫీ రాసిన పద్యం ఆధారంగా రాణి పద్మిని పైన సినిమాను తెరకెక్కించాడు భన్సాలి.

అక్షరాలా 300 కోట్లకు పైగా వసూలు చేసిన సినిమాలో.. దీపికా పదుకొనె రాణి పద్మావతిగా, షాహిద్ కపూర్ మహారాజు రతన్ సింగ్ గా, రణ్వీర్ సింగ్ క్రూరమైన అలావుద్దీన్ ఖిల్జీగా ముఖ్యపాత్రలు పోషించారు. సినిమా మొదలైనప్పుడే బోలెడు వివాదాలలో చిక్కుకున్నప్పటికీ, ఎట్టకేలకు జనవరి 25వ తారీఖున విడుదల అయ్యింది. బడ్జెట్ కు తగ్గట్టుగానే సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కోట్లు గడించిన సంగతి తెలిసిందే. ఇదంతా తెలిసిన విషయమేగా మళ్ళీ ఎందుకు చెప్తున్నారు అనుకుంటున్నారా? ఈ సినిమా త్వరలో ఇంటర్నెట్లో విడుదల అవ్వబోతోందట. అమెజాన్ ప్రైమ్ వారే ఈ సినిమా పై హక్కుల్ని చేజిక్కించుకున్నారు.

మార్చ్ 27వ తారీఖున పద్మావత్ సినిమా అమెజాన్ లో విడుదలకు సిద్దంగా ఉంది. ఈ విషయం ప్రైమ్ వారే స్వయంగా ట్విటర్లో తెలియచేశారు. అటు బాలీవుడ్లో ఇటు టాలీవుడ్లో పద్మావత్ సినిమా కాసుల వర్షం కురిపించింది. మరి ఇప్పుడు ఇంటర్నెట్లో మరిన్ని రికార్డులు సొంతం చేసుకోబోతోందో వేచి చూద్దాం..