టాప్ స్టోరి: బికినీ వంటకం

Tue Feb 19 2019 08:00:02 GMT+0530 (IST)

వేడి వేడిగా వంట నేర్పబడును.. సండే పూట చికెన్.. చేపలు రొయ్యల పులుసు వండి వడ్డిస్తాం! అంటూ ఇదిగో ఈ భామలు అంతర్జాలంలో వేడెక్కిస్తున్న తీరు ప్రముఖంగా చర్చకొచ్చింది. ఏదో వంట నేర్పిస్తాం అని ప్రకటించినంత మాత్రాన వీళ్లు వంట మనుషులు అనుకుంటే పొరపాటే. నలభీమ పాక శాస్త్రంలో నిపుణులైన సెలబ్రిటీ హాట్ గాళ్స్ అన్నమాట.కిచెన్ లో వంటలు చేయడంలో ఎంత ఘనాపాటీలో బికినీ బీచ్ లో దిగితే అంతే భీకరమైన ఘనాపాటీలు. ఓవైపు వలపుదోపిడీకి పాల్పడే బికినీలు వేస్తూనే - పాకశాస్త్రంలో నిపుణత అలవాటు చేసుకున్నారు. ప్రఖ్యాత ఇండో అమెరికన్ గాళ్ .. నటి పద్మాలక్ష్మి వంటలో స్పెషలిస్ట్. ఆవిడ ప్రముఖ రచయిత సల్మాన్ రష్ధీ భార్య అన్న సంగతి తెలిసిందే. తమిళనాడుకు చెందిన ఈ హాట్ బ్యూటీ కుకరీపై పుస్తకాలు రచించారు. టెలివిజన్ ప్రొడ్యూసర్ గా .. హోస్ట్ గానూ అందరికీ సుపరిచితం.

పద్మాలక్ష్మి మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా పాక శాస్త్రంలో నిపుణులైన బికినీ గాళ్స్ చాలామందే ఉన్నారు. ఇందులో షిప్రా ఖన్నా `మాస్టర్ చెఫ్ ఇండియా సీజన్- 2` విజేత. సొంతంగా ఓ యూట్యూబ్ చానెల్ పెట్టుకుని మరీ నెటిజనులకు వంటలు నేర్పిస్తున్నారు ఈవిడ. కుకరీస్ పై రెండు పుస్తకాల్ని రచించారు. టైటిల్ విజేతగానూ పలు అవార్డు వేడుకల్లో మెరిసారు. రవీందర్ భోగల్ అనే ప్రముఖ టెలివిజన్ ప్రెజెంటర్ సైతం వంట శాస్త్రంలో నిపుణురాలు. లండన్ లోని ప్రఖ్యాత `జికోని` ఓనర్ గా పాపులర్. నదియా జియోసియా అనే కెనడియన్ చెఫ్ .. టీవీ పర్సనాలిటీ వరల్డ్ వైడ్ అంతే ఫేమస్. నిగెల్లా లాసన్ ఇంగ్లీష్ టెలివిజన్ లో ఫేమస్. నిగెల్లా ఈట్స్.. నిగెల్లా ఎక్స్ ప్రెస్ అంటూ పలు టీవీ షోలతోనూ అమ్మడు వేడెక్కించింది. అమెరికన్ ఫ్యాషన్ డిజైనర్ రాల్ఫ్ లారెన్ కుమార్తె డైలాన్ లారెన్ సైతం వంటలో నిపుణురాలు. ఈ అందాల రాకుమారి వేడెక్కించే వంటకంలోనూ ఎంతో స్పెషల్. ప్రముఖ ఎగ్జిక్యూటివ్ చెఫ్ క్యాసీ థాంప్సన్ సైతం వేడెక్కించే బికినీలతో మతి చెడగొడుతుంటుంది. మొత్తానికి ఈ చెఫ్ లు కం మోడల్స్ వంట పేరుతో అంతర్జాలంలో అగ్గి రాజేయడంపై హాట్ హాట్ గా చర్చ సాగుతోంది. బికినీ వంటకం రుచులు ఎంతో స్పైసీ గురూ! అంటూ యూత్ వేడెక్కిపోతున్నారు.