Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్ డైరెక్టర్ తో సూర్య

By:  Tupaki Desk   |   25 May 2016 10:09 AM GMT
సూపర్ స్టార్ డైరెక్టర్ తో సూర్య
X
మూడో సినిమాకే సూపర్ స్టార్ రజినీకాంత్ తో సినిమా చేసే ఛాన్స్ కొట్టేయడమంటే మాటలు కాదు. ఆ అదృష్టం పా.రంజిత్ కు దక్కింది. అట్టకత్తి అనే ఓ చిన్న సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడితను. ఈ సినిమా విడుదల విషయంలో అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. ఓ దశలో ఆ సినిమా రిలీజే కాదని కూడా అనుకున్నారు. కానీ అతి కష్టం మీద సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ముందు ఈ సినిమాను పట్టించుకోకపోయినా.. తర్వాత మౌత్ టాక్ ద్వారా జనాల్లోకి వెళ్లింది. అనుకోకుండా పెద్ద హిట్టయి దర్శకుడిగా రంజిత్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. అనేక అవార్డులూ అందుకుంది. ఇక కార్తితో చేసిన రెండో సినిమా ‘మద్రాస్’ సెన్సేషనల్ హిట్టయి.. రజినీతో సినిమా చేసే అవకాశం తెచ్చిపెట్టింది.

రజినీ లాంటి సూపర్ స్టార్ ను వైవిధ్యమైన సినిమాలు తీసే రంజిత్ డీల్ చేయగలడా అని సందేహించారు కానీ.. ‘కబాలి’ టీజర్ చూస్తే రంజిత్ మామూలోడు కాదని అందరికీ అర్థమైంది. ఈ సినిమా ఇంకా విడుదల కాకుండానే చాలామంది స్టార్ హీరోలు అతడి వెంటపడుతున్నారు. ఐతే విలక్షణ నటుడు సూర్యతో సినిమా చేయడానికి అతను అంగీకారం తెలిపాడు.

ఇటీవలే ‘24’తో పలకరించిన సూర్య.. ప్రస్తుతం హరి దర్శకత్వంలో ‘సింగం-3’ చేస్తున్నాడు. దీని తర్వాత అతడికి కొన్ని కమిట్మెంట్లు ఉన్నప్పటికీ.. రంజిత్ దర్శకత్వంలో సినిమా చేయడానికే మొగ్గు చూపాడు. ఇటీవలే రంజిత్ సూర్యకు ఓ లైన్ చెప్పాడు. అది ఓకే అవడంతో ఇక స్క్రిప్టు మీద కూర్చోబోతున్నాడతను. ఇంకో మూడు నెలల్లో ఆ సినిమా సెట్స్ మీదికి వెళ్లబోతోంది. ఈ సినిమా ఆటోమేటిగ్గా తెలుగులోనూ వస్తుందనుకోండి.