Begin typing your search above and press return to search.

పీవీపీకి టీజర్ల సీజన్ నడుస్తోంది

By:  Tupaki Desk   |   13 Feb 2016 11:51 AM GMT
పీవీపీకి టీజర్ల సీజన్ నడుస్తోంది
X
భారీ సినిమాలతో దూసుకుపోతున్న పీవీబీ బ్యానర్.. ఇప్పటివరకూ భారీ హిట్ కొట్టలేదు కానీ.. ఈ ఏడాది మాత్రం అన్నీ సూపర్ హిట్ ల పైనే కన్నేసింది. ఈ బ్యానర్ లో రూపొందిన సినిమాల టీజర్లు వరుసగా రిలీజ్ అయ్యి.. ప్రేక్షకుల్లో ఉత్కంఠ కలిగిస్తున్నాయి. 2016లో ఈ బ్యానర్ నుంచి రానున్న అతి పెద్ద మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రహ్మోత్సవం.

ఇప్పటికే ఈ చిత్ర టీజర్ రిలీజ్ అయ్యి, ఎన్నో రికార్డులు సృష్టించేసింది. శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న బ్రహ్మోత్సవంపై.. తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డులు తుడిచేస్తుందనే అంచనాలు ఉన్నాయి. దీని తర్వాత రీసెంట్ గా క్షణం మూవీ థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ టీజర్.. ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. కిడ్నాప్ థ్రిల్లర్ జనాలను బాగా ఎంటర్ టెయిన్ చేస్తుందనేలా.. ప్రామిసింగ్ గానే ఉంది. ఇప్పుడు మరో చిత్రానికి కూడా టీజర్ రిలీజ్ చేసేందుకు పీవీపీ సంస్థ సిద్ధమవుతోంది.

అక్కినేని నాగార్జున - కార్తిలు నటించిన మల్టీస్టారర్ మూవీ ఊపిరి టీజర్ ను లాంఛ్ చేయనున్నారు. ఫిబ్రవరి 14న.. అంటే వేలైంటైన్స్ డే రోజున ఊపిరి టీజర్ ని రిలీజ్ చేయాలని యూనిట్ నిర్ణియంచింది. ఇవన్నీ అతి తక్కువ సమయంలోనే రిలీజ్ అయ్యే సినిమాలు కావడం విశేషం. మొత్తానికి ఈ ఏడాది పీవీపీ సంస్థ నుంచి భారీ బ్లాక్ బస్టర్ ఎక్స్ పెక్ట్ చేయచ్చు.