Begin typing your search above and press return to search.

పవన్ టైటిల్ వద్దని చెప్పిన పీవీవీ?

By:  Tupaki Desk   |   24 March 2017 5:02 AM GMT
పవన్ టైటిల్ వద్దని చెప్పిన పీవీవీ?
X
భారీ చిత్రాల నిర్మాతగా గుర్తింపు పొందిన నిర్మాత పొట్లూరి వి ప్రసాద్. క్షణం.. ఘాజీ లాంటి మూవీస్ ని నిర్మించి.. కాన్సెప్ట్ సినిమాలను తీయడంలో తాను దిట్ట అని ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడీయన గోపీచంద్ నటిస్తున్న ఓ చిత్రాన్ని హ్యాండిల్ చేస్తున్నారు.

బి. గోపాల్ దర్శకత్వంలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఓ సినిమా.. ఇప్పుడు షూటింగ్ చివరిదశలో ఉంది. నిర్మాత తాండ్ర రమేష్ ఈ చిత్రాన్ని రూపొందించగా.. నిధుల కొరతతో కొంత కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ సినిమా రిలీజ్ కి సాయం చేసేందుకు రంగంలోకి దిగారు పీవీపీ. సబ్జెక్ట్ నచ్చడంతో ఎంట్రీ ఇచ్చిన పీవీపీ.. టైటిల్ విషయంలో మాత్రం అభ్యంతరాలు చెబుతున్నారట. 'ఆరడుగుల బుల్లెట్' అనే పేరు ఈ చిత్రానికి నిర్ణయించగా.. పవన్ ను గుర్తు చేసే టైటిల్ విషయంలో పీవీపీ స్ట్రాంగ్ గా అబ్జెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది. వేరే టైటిల్ నిర్ణయించాల్సిందిగా ఇప్పటికే నిర్మాతకు సూచనలు కూడా జారీ చేశారట.

పీవీపీ ఎంట్రీ ఇవ్వడంతో సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ మూవీ.. ఇప్పుడు శరవేగంగా పూర్తి కానుంది. గోపీచంద్-నయన్ ల మధ్య ఒక డ్యూయెట్ తో పాటు.. ఓ ఐటెం సాంగ్ ను కూడా చిత్రీకరిస్తే.. ఈ మూవీని రిలీజ్ చేసేయచచ్ను తెలుస్తోంది. మే నెలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/