Begin typing your search above and press return to search.

ఒక్క సినిమాలో పది మంది హీరోయిన్లా?

By:  Tupaki Desk   |   7 Feb 2016 6:11 AM GMT
ఒక్క సినిమాలో పది మంది హీరోయిన్లా?
X
ఒక పాటలో పది మంది హీరోయిన్లు కనిపించడం కొత్తేమీ కాదు. ‘కింగ్’ సినిమాలో నాగ్ ఇలాగే బోలెడంతమంది హీరోయిన్లతో డ్యాన్స్ చేశాడు. కానీ ఒకే సినిమాలో పది మంది హీరోయిన్లు నటించడం ఎప్పుడైనా చూశామా? ఈ ప్రయోగానికే సిద్ధపడుతున్నాడు పొట్లూరి వరప్రసాద్. వర్ణ - సైజ్ జీరో లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తీసిన పీవీపీ సంస్థ త్వరలోనే పది మంది హీరోయిన్లను ప్రధాన పాత్రధారులుగా పెట్టి సినిమా చేయబోతోంది. ఈ సినిమాలో సమంత - అనుష్క లాంటి టాప్ హీరోయిన్ల తో పాటు అనసూయ - రష్మీ లాంటి బుల్లితెర భామల్ని కూడా నటింపజేయాలని చూస్తున్నాడు పొట్లూరి.

ఈ సినిమాకు సంబందించిన కథ కూడా రెడీగా ఉందని అంటున్నాడు పొట్లూరి. ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారు, సినిమా ఎప్పుడు మొదలవుతుంది లాంటి విషయాలు మాత్రం చెప్పలేదు. లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తన సంస్థకు ఇప్పటిదాకా అచ్చిరాకున్నా.. పొట్లూరి మళ్లీ హీరోయిన్ల మీద ఇంత ప్రత్యేకమైన ఆసక్తి చూపిస్తుండటం విశేషమే. సమంత - అనుష్క లాంటి వాళ్లు ముఖ్య పాత్రల్లో కనిపించారంటే ఈ సినిమాకు రావాల్సిన క్రేజ్ వచ్చేస్తుంది. సౌత్ ఇండియాలో ఇది ఒక క్రేజీ ప్రాజెక్టు అయిపోతుంది. ప్రస్తుతం పీవీపీ సంస్థ నిర్మిస్తున్న ‘క్షణం’ కూడా కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమానే. ఈ బేనర్లో వచ్చిన లేటెస్ట్ తమిళ మూవీ ‘బెంగళూరు డేస్’ ఏవరేజ్ టాక్‌ తో నడుస్తోంది.