Begin typing your search above and press return to search.

మహేష్ పై పీవీపీ సా'దించారు'గా

By:  Tupaki Desk   |   21 Jun 2018 11:06 AM GMT
మహేష్ పై పీవీపీ సాదించారుగా
X

హీరోలపై నిర్మాతలు తిరుగుబాటు జెండా ఎగరేయడం.. అది కూడా స్టార్ హీరోపై బడా నిర్మాత ఏకంగా కోర్టు మెట్లు ఎక్కడం అంటే.. టాలీవుడ్ లో బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. గతంలో ఇలాంటివి ఉన్నాయో లేదో కానీ.. అసలు సినిమా ప్రారంభమే కాకుండా.. ఓ స్టార్ హీరోపై.. ఆయన చేయబోయే నెక్ట్స్ పిక్చర్ కేసు వేసిన ఘనత మాత్రం పీవీపీదే.

కేసు వేయడం మాత్రమే కాదు.. తాను అనుకున్నది సాధించడం ఇక్కడ పీవీవీ ఘనతగా చెప్పాలి. పీవీపీ బ్యానర్ పై మహేష్ రెండు సినిమాలు చేయాల్సి ఉండగా.. బ్రహ్మోత్సవం డిజాస్టర్ తర్వాత మహేష్ ఎందుకో సైడ్ అయ్యాడు. పీవీపీతో చేయాల్సిన వంశీ పైడిపల్లి మూవీ.. మెల్లగా దిల్ రాజుకు షిఫ్ట్ అయింది. అందులో అశ్వినీ దత్ కి కూడా కొంత వాటా ఇచ్చారు. అయితే.. ఇప్పుడు పీవీపీతో సెటిల్మెంట్.. కోర్టు వ్యవహారాల కారణంగా.. ముచ్చటగా ముగ్గురు నిర్మాతల వ్యవహారంగా కథ మారిపోయింది.

తన కోర్టు ఖర్చులను రాబట్టుకోవడం మాత్రమే కాకుండా.. మహేష్ కొత్త సినిమాలో మూడో వంతు నిర్మాణ భాగం దక్కించుకున్నారు పీవీపీ. పూర్తి సినిమా చేయాల్సి ఉండడంతో పోల్చితే.. ఇది కాసింత నిరుత్సాహకరమే అయినా.. స్టార్ హీరోల తీరును నిలదీసే ఈ చర్యకు పలువురి నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ డీల్ మొత్తంగా అందరికంటే ఎక్కువగా నష్టపోయేది మహేష్ బాబే అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ముగ్గురు పెద్ద నిర్మాతలతో మూడు సినిమాలు చేసుంటే.. భారీ రెమ్యూనరేషన్ తో పాటు లాభాల్లో వాటా కూడా వచ్చేది.

కానీ ఇప్పుడు ముగ్గురు నిర్మాతల కారణంగా రావాల్సిన రెమ్యూనరేషన్ కే కోత పడగా.. లాభాల్లో వాటా అసలు అడిగే ఛాన్సే లేదు. ఏతా వాతా నిర్మాతలు అందరికీ న్యాయం చేసినట్లుగా మహేష్ అండ్ టీం చెప్పిస్తున్నా.. ఇక్కడ మహేష్ తో సహా అందరూ నష్టపోయిన వారే. కాకపోతే పీవీపీ కారణంగా మహేష్ కు డబ్బులు పోగొట్టుకోవడంతో పాటు ఓటమిని కూడా అంగీకరించాల్సిన పరిస్థితి తలెత్తింది.