కోలీవుడ్ స్టార్స్ తో మన సింధు

Fri Jan 12 2018 23:09:04 GMT+0530 (IST)

క్రీడాకారులు సినిమా తారలు ఇమేజ్ ను సంపాదించుకోవడంలో చాలా ఈక్వల్ గా ఉంటారని అందరికి తెలిసిందే. ఒకరు నటిస్తే మరొకరు జీవిస్తారు. కానీ ఫైనల్ గా గెలవడానికి ప్రత్నిస్తుంటారు. దీంతో అభిమానులు వారిని ఎంతో ఇష్టపడతారు. ఇక అసలు విషయానికి వస్తే క్రీడాకారులు సినీ నటులు ఎప్పుడు కలుసుకున్నా చాలా స్పెషల్ గా ఉంటుంది. అయితే అదే తరహాలో రీసెంట్ గా మన బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సిందు కోలీవుడ్ స్టార్స్ తో కలిసింది.భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు కోలీవుడ్ స్టార్స్ తో కనిపించడం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇకపోతే ప్రిమియర్ బ్యాడ్మింటన్ లీగ్ కు ఈ సారి ఆదరణ బాగా దక్కింది. ముఖ్యంగా సిని తారలు ఆ మ్యాచులను ప్రోత్సహిస్తున్నారు. ఇందులొ చెన్నై స్మాషర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.

చెన్నైలో ఇటీవల జరిగిన లీగ్ మ్యాచులకు కోలీవుడ్ స్టార్స్ అజిత్ - షాలిని దంపతులు అలాగే జ్యోతికా - సూర్యా జోడి వచ్చింది. అయితే మ్యాచ్ అనంతరం సింధు అభిమానంతో వారిని కలిసి ఫొటోలకి స్టిల్స్ ఇచ్చింది. అందుకు సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వారితో కలిసి ఫొటో దిగడం తనకు చాలా ఆనందంగా ఉందని సింధు ట్వీట్ చేసింది. ఇక ఫైనల్స్ ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలో జరగనున్నాయి.