తాప్సీ ఇస్తున్న ఫంక్షన్ కి ప్రభాస్ గెస్ట్

Sat Aug 12 2017 13:12:11 GMT+0530 (IST)

బహుబలి తరువాత హాలీడే ఎంజాయ్ చేస్తూ సైలెంట్ అయిపోయిన డార్లింగ్ ప్రభాస్ ఎట్టకేలకు ఓ సినిమా ఫంక్షన్ కు హాజయ్యేందుకు అంగీకరించాడని తాజాగా ఫిల్మ్ నగర్ లో ఓ వార్త హల్ చల్ చేస్తుంది. సాహో షూటింగ్ అప్ డేట్ పై ఎలాంటి క్లారిటీ ఇవ్వని ప్రభాస్ ప్రస్తుతం తన ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తున్నాడని సన్నిహితులు చెబుతున్నారు. అలానే పెళ్లి పనుల్లో డార్లింగ్ బిజీగా ఉన్నాడనే వార్తలు వచ్చాయి. అయితే ఈ ఆగస్ట్ 18న విడుదల కాబోతున్న కామెడీ హారర్ సినిమా ఆనందో బ్రహ్మ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రభాస్ ఛీఫ్ గెస్ట్ గా హాజరవుతున్నాడనే న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

ఈ సినిమాలో తాప్సీ మెయిన్ లీడ్ గా యాక్ట్ చేస్తుంది. ఆమెతో మరో నలుగురు కమీడియన్లు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇక ప్రభాస్ ఛీఫ్ గెస్ట్ గా రాబోతుండటంతో ఆనందో బ్రహ్మా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారట దర్శకనిర్మాతలు. ఆగస్ట్ 14న పార్క్ హాయత్ లో ఈ సినిమా ఫంక్షన్ జరగుతుందని సమాచారం. అయితే బాహుబలి తరువాత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్న ప్రభాస్ తన ఫ్రెండ్ తాప్సీ కోరక మెరకే ఈ సినిమా ఫంక్షన్ కి వస్తున్నాడని చిత్ర వర్గాలు తెలిపాయి. మరి ఈ ఫంక్షన్ లో ప్రభాస్ న్యూలుక్ ఎలా ఉంటుందో చూడాలి.