Begin typing your search above and press return to search.

పిల్లకు అంతా బిగ్ బాస్ బూస్ట్

By:  Tupaki Desk   |   26 Sep 2017 10:27 AM GMT
పిల్లకు అంతా బిగ్ బాస్ బూస్ట్
X
ఎన్ని సినిమాల్లో నటించినా కొంతమందికి అనుకున్నంత ఆదరణ దక్కదు. వారి సినిమాల్లో కనిపించినా పబ్లిక్ పేరును అంతగా గుర్తు పెట్టుకోరు. ఒకవేళ వారికి గుర్తుండిపోయే పాత్రలను చేస్తే ఎక్కడ కనిపించిన వారిని చూసేందుకు ఎగబడతారు. కానీ ఎవరు ఊహించని విధంగా ఒక రియాలిటీ షో ద్వారా బాగా పాపులారిటిని సంపాదించుకున్న భామ ఓవియా.

తమిళ్ బిగ్ బాస్ షోను మొదట్లో అంతగా ఎవరు పట్టించుకోలేదు. కానీ ఆ తర్వాత షోలో జరుగుతున్న పరిణామాలకు జనం ఒక్కసారిగా ఆశ్చర్యపోయి బుల్లి తెరకు అంకితం అయిపోయారు. ముఖ్యంగా ఓవియా కి బిగ్ బాస్ లో మంచి కంటెస్టెంట్ గా గుర్తింపు పొంది అందరిని ఆకర్షించింది. కానీ ఎప్పుడైతే ఆమె వెళ్లిపోయిందో షోకి రేటింగ్ తగ్గిపోయింది. ఆ తర్వాత ఆమెను రప్పించాలని ప్రయత్నించినా ఆమె రాలేదు. అయితే షో మాత్రం అమ్మడికి బాగానే పాపులారిటీని తెచ్చిపెట్టింది. అంతకుముందు మలయాళం - తమిళ్ సినిమాల్లో నటించినా రాని గుర్తింపు షో ద్వారా రావడంతో అమ్మడికి అవకాశాలు వచ్చాయి.

అవకాశాలకంటే సినిమా ఛాన్సులు అనుకుంటున్నారా ఏంటి?. సినిమాల్లో అవకాశాలు లైట్ గానే వస్తున్నాయి. కానీ షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ లకు మాత్రం బాగానే వెళుతోంది. రిబ్బన్ కటింగ్ లను చేసుకుంటూ రెమ్యునరేషన్ ని బాగానే అందుకుంటోంది. రీసెంట్ గా చెన్నై లో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్లి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. అంతే కాకుండా పాట పాడి అందరిని ఉత్తేజపరిచింది. మొత్తానికి ఓవియాకు బిగ్ బాస్ షో మంచి బూస్ట్ ని ఇచ్చిందనే చెప్పాలి.