Begin typing your search above and press return to search.

పక్క భాషలోళ్లకి పక్కా కేరక్టర్లు

By:  Tupaki Desk   |   17 Nov 2017 5:30 PM GMT
పక్క భాషలోళ్లకి పక్కా కేరక్టర్లు
X
తెలుగు సినిమాల్లో ఇతర సినీ పరిశ్రమలకు చెందిన నటీనటులు కనిపించడం కొత్తేమీ కాదు. హీరోయిన్స్ అయితే.. తెలుగమ్మాయిలను ఒక చేతి వేళ్లతో లెక్క పెట్టగలిగేంత మందే ఉంటారు. ఇక విలన్స్ సంగతి సరే సరి. ఒకరిద్దరు మినహాయిస్తే.. ప్రస్తుతం అందరూ దాదాపుగా ఇతర భాషల నుంచి అరువు తెచ్చుకున్న వారే. ఇప్పుడు కేరక్టర్ ఆర్టిస్టులను కూడా పరాయి భాషల నుంచి తెచ్చుకుంటూ.. తెలుగు సినిమా స్థాయిని తెగ పెంచేస్తున్నట్లు చెప్పే ట్రెండ్ బాగానే నడుస్తోంది.

గతేడాది వచ్చిన జనతా గ్యారేజ్ మూవీలో ఎన్టీఆర్ హీరో అయినా.. మోహన్ లాల్ చేసిన పాత్రను ఏ మాత్రం తక్కువ చేయలేం. సినిమాకు అత్యంత కీలకమైన రోల్ అది. మనమంతా మూవీలో కూడా మెయిన్ రోల్ లో నటించేశారు మోహన్ లాల్. ఇప్పుడు విజయ్ సేతుపతి కూడా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. మెగాస్టార్ నటిస్తున్న సై రా నరసింహారెడ్డి చిత్రంలో.. ఓ ముఖ్య పాత్రను పోషించబోతున్నాడు. ఈ రోల్ సినిమాలో కీలకం కావడంతో.. ఫ్రెష్ ఫీలింగ్ జనాలకు అందించేందుకే ఈ పాత్రను విజయ్ సేతుపతికి ఇచ్చారట.

నాగచైతన్య మూవీ సవ్యసాచి లో తమిళ్ యాక్టర్ మాధవన్ నటిస్తున్నాడు. తెలుగులో కూడా ఈయనకు మార్కెట్ ఉన్నా.. డైరెక్ట్ తెలుగులో సత్తా చాటడం ఇదే. ఇప్పుడు నిర్మాత సురేష్ బాబు.. తన సోదురుడు వెంకటేష్ హీరోగా నటించబోయే లేటెస్ట్ మూవీ కోసం.. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ ను తీసుకోనున్నాడని తెలుస్తోంది. ఇవన్నీ రాబోయే చిత్రాలైతే.. అత్తారింటికి దారేది మూవీలో బొమన్ ఇరానీని తీసుకున్నాడు త్రివిక్రమ్. కీలకమైన పాత్రలలో పరాయి భాషల నటులు సత్తా చాటేస్తున్నారు. కానీ ఈ విషయంపై ఇక్కడి కేరక్టర్ ఆర్టిస్టుల నుంచి విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి.