Begin typing your search above and press return to search.

అందరూ అనుకునేలా ఉందే

By:  Tupaki Desk   |   17 Jan 2018 6:15 AM GMT
అందరూ అనుకునేలా ఉందే
X
సీనియర్ కామెడీ హీరో - ఇప్పటి క్యారెక్టర్ అరిస్ట్ నరేష్ గారి అబ్బాయి నవీన్ విజయ్ కృష్ణ తెరంగేట్రం పోయిన ఏడాది 'నందిని నర్సింగ్ హోం'తో జరిగిన సంగతి తెలిసిందే. సినిమా పెద్దగా ఆడనప్పటికీ నవీన్ కు మాత్రం మంచి పేరే వచ్చింది. కామెడీ టైమింగ్ లో నాన్నకు తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకునే క్రమంలో ఆచి తూచి కథలను ఎంచుకుంటున్న నవీన్ కొత్త సినిమా అనౌన్స్ చేసారు. పేరు ‘ఊరంతా అనుకుంటున్నారు”. నవీన్ బర్త్ డే సందర్భంగా మోషన్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. గ్రామ్ ఫోన్ రికార్డు ప్లే చేస్తున్నట్టు చూపించి బ్యాక్ గ్రౌండ్ లో టైటిల్ ఉన్న పాత పాటను ప్లే చేసి వెరైటీగా ఆకట్టుకున్న యూనిట్ కంటెంట్ కూడా అలాగే ఉంటుంది అంటున్నారు. ఈ పాట ఎ ఎన్ ఆర్ 'రైతు కుటుంబం' సినిమాలో ఉంటుంది.

బాలాజీ సనాల అనే కొత్త దర్శకుడు మెగా ఫోన్ చేపడుతున్న ఈ సినిమాని శ్రీహరి - పద్మనాభరెడ్డి అనే డెబ్యు నిర్మాతలు టేకప్ చేయటం విశేషం. అవసరాల శ్రీనివాస్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ మూవీలో హీరొయిన్ గా మేఘా చౌదరి నటించబోతోంది. తనకూ ఇది మొదటి సినిమానే. ఈ నెల చివరి వారంలో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు. నవీన్ ఫ్రెండ్ సాయి ధరం తేజ్ తో మోషన్ పోస్టర్ లాంచ్ చేయించిన నవీన్ దీంతో తన మొదటి హిట్ కొడతాను అనే నమ్మకంతో ఉన్నాడు.

ఆ మధ్య నవీన్ విజయ్ కృష్ణ హీరోగా తన రెండో సినిమాగా విట్టలాచార్య అని మొదలుపెట్టి ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసారు ఆ తర్వాత దానికి సంబంధించి ఎటువంటి అప్ డేట్స్ లేవు. ఇది మూడో సినిమా అవుతుంది. నవీన్ విజయ్ కృష్ణ డెబ్యు మూవీ గతంలో స్టార్ట్ అయ్యాక ఆగిపోయింది. దాని పేరు ‘అయినా నువ్వు ఇష్టం’. కీర్తి సురేష్ నే హీరొయిన్ గా అనుకున్నారు. ఇక ఇప్పటి నుంచి బ్రేకులు ఉండవు అంటున్న నవీన్ విజయ్ కృష్ణ విజయనిర్మల మనవడిగా కూడా ప్రత్యేక గుర్తింపు ఉంది.