Begin typing your search above and press return to search.

50వ రోజు టికెట్లు అప్పుడే సోల్డ్ అవుట్

By:  Tupaki Desk   |   6 Feb 2019 5:54 AM GMT
50వ రోజు టికెట్లు అప్పుడే సోల్డ్ అవుట్
X
ఎంత పెద్ద స్టార్ అయినా ఒక సినిమా అర్ధ శతదినోత్సవం జరుపుకోవడమే పెద్ద ఘనతగా భావిస్తున్న తరుణంలో ఏకంగా 50వ రోజుకు టికెట్ బుకింగ్ మొదలుపెట్టడం అనేది ఊహకు అందదు కదా. ఇక్కడే తమిళ తంబీలు తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. సంక్రాంతికి విడుదలైన అజిత్ విశ్వాసం అక్కడ ఎంత రచ్చ చేస్తోందో తెలిసిందే. కథ రొటీన్ గానే ఉన్నప్పటికీ శివ టేకింగ్ తో పాటు అజిత్ స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానులతో కనక వర్షం కురిపించేలా చేసాయి. ఇటీవలే విశ్వాసం 25 రోజులు పూర్తి చేసుకుంది. వంద కోట్లు దాటేసిన వసూళ్ళతో టాప్ 3 ప్లేస్ కోసం మెర్సల్ ని దాటేందుకు ఉరకలు వేస్తోంది.

ఈ సందర్భంగా చెన్నైలోని రోహిణి సిల్వర్ స్క్రీన్ మల్టీ ప్లెక్స్ విశ్వాసం 50వ రోజు టికెట్లను అమ్మకానికి ఉంచింది. అంతేనా అనుకోకండి. మరో విశేషం కూడా ఉంది. ఆ కాంప్లెక్స్ లో ఉన్న 6 స్క్రీన్లలో ఆ రోజు విశ్వాసమే వేయబోతున్నారు. ట్విస్ట్ ఏంటంటే అన్నేసి స్క్రీన్ల టికెట్లు హాట్ కేకుల్లా ఫాస్ట్ గా బుక్ అయిపోతున్నాయి. అదండీ అజిత్ మీద ఆయన ఫ్యాన్స్ కున్న అభిమానం. ఎప్పుడో మూడు వారాల తర్వాత వచ్చే 50 డేకి ఇప్పుడే టికెట్ బుక్ చేసుకోవడం అంటే మాములు విషయమా. అందులోనూ చూసేసిన సినిమాకు. విశ్వాసం పైరసీ బారిన పడి ఆన్ లైన్ లో మంచి ప్రింట్ వచ్చినా ఇంత ఉదృతిని కొనసాగించడం చూస్తే ఆశ్చర్యం వేయకమానదు.

దీంతో పాటే అదే రోజు విడుదలైన రజనికాంత్ పేట జోరు ఈ స్థాయిలో లేదు. వంద కోట్ల విషయంలో పోటీ పడినా హాఫ్ సెంచరీ టైంకి ప్యాక్ అప్ అయ్యేలా ఉంది. తెలుగులో తీవ్ర నష్టాలు ఇచ్చిన పేట తమిళ్ లో సేఫ్ అయ్యింది. ఇప్పుడీ విశ్వాసం 50వ రోజు టికెట్ల బుకింగ్ చూసి అక్కడి ట్రేడ్ సైతం నివ్వెరబోతోంది. అందుకే అజిత్ ని తలా అని ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకుంటారు. సెంటర్ల విషయంలో కూడా విశ్వాసం కొత్త రికార్డు సెట్ చేయబోతోందని చెన్నై రిపోర్ట్