చెర్రీతో ఓంకార్.. సాధ్యమేనా?

Fri Oct 13 2017 17:55:42 GMT+0530 (IST)

యాంకర్ గా విభిన్నమైన స్టైల్ ని మెయింటెయిన్ చేసిన ఓంకార్.. తనలోని దర్శకుడిని బయటకు తీసేశాడు. మొదటగా చేసిన జీనియస్ ఆడకపోయినా.. రెండో సినిమా రాజుగారి గది మాత్రం ఆ ఏడాది దసరా సీజన్ లో వచ్చి బ్లాక్ బస్టర్ అయిపోయింది. వెంటనే అదే సినిమాకి సీక్వెల్ సిద్ధం చేసుకుని.. నాగార్జున.. సమంతలతో తీస్తూ భారీ చిత్రాన్నే తీయగలిగాడు.ఇవాళ రాజుగారి గది2 విడుదల కాగా.. దర్శకుడు ఓంకార్ తర్వాతి స్టెప్ గురించే ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. టాలీవుడ్ లో కొందరు జనాల మాటల ప్రకారం.. త్వరలో రామ్ చరణ్ ను కలవబోతున్నాడట ఓంకార్. స్టోరీ లైన్ ను ఇప్పటికే సిద్ధం చేసుకోగా మెగా పవర్ స్టార్ తో సినిమా తీసి.. తన రేంజ్ ను ట్యాలెంట్ ను మరింతగా చూపించాలని భావిస్తున్నాడట ఓంకార్.యంగ్ డైరెక్టర్స్ పై సానుకూలంగా ఉండే చెర్రీ.. ఓంకార్ తో డిస్కషన్ కు ఓకే చెప్పాడని తెలుస్తోంది.

ఇదంతా రాజు గారి గది2 చిత్రం సక్సెస్ మీద ఆధారపడి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే రాజుగారి గది లో బడ్జెట్లో తీసిన మూవీ. ఇప్పుడు నాగ్.. సమంతల పుణ్యమా అని పాతిక కోట్ల సినిమాగా మారింది. ఈ టెస్ట్ లో కూడా పాసయితే.. నెక్ట్స్ ఓంకార్ టార్గెట్ 50 కోట్ల బడ్జెట్ తో 100 కోట్ల వసూళ్లను సాధించే సినిమా తీయడమేనట. ఇందులో ఎన్ని జరుగుతాయో చూద్దాం.