Begin typing your search above and press return to search.

బెల్లకొండతో యాంకర్ ఆట షురూ

By:  Tupaki Desk   |   13 Jan 2018 4:39 AM GMT
బెల్లకొండతో యాంకర్ ఆట షురూ
X
బుల్లితెర నుంచి వెండితెర వరకు వచ్చిన యాంకర్.. దర్శకుడు ఓంకార్.. ఎట్టకేలకు సినీ దర్శకుడిగా స్థిరపడినట్లే కనిపిస్తోంది. హారర్ కామెడీ ట్రాక్ తో వచ్చిన రాజుగారి గది సినిమాతో హిట్ అందుకున్న ఓంకార్. ఆ తరువాత దానికి సీక్వెల్ తీసి పర్వాలేదు అనిపించాడు. ఇక నెక్స్ట్ ఓంకార్ కొంచెం ఆ ట్రాక్ ని పక్కనపెట్టాలని అనుకుంటున్నాడట. మాస్ - క్లాస్ తరహాలో ఉండే ఒక క్రీడకు సంబందించిన కథను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

ఆ కథలో హీరో మరెవెరో కాదు. బెల్లంకొండ వారసుడు శ్రీనివాస్. కొన్ని నెలల క్రితం వచ్చిన జయ జానకి నాయక సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాస్ ప్రస్తుతం సాక్ష్యం సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఆ షూటింగ్ సగం పూర్తయ్యింది. అయితే ఆ సినిమా ఫినిష్ కాకముందే మరొక కాన్సెప్ట్ ను ఒకే చేశాడు. రీసెంట్ గా ఓంకార్ వినిపించిన లైన్ ఆ హీరోకి తెగ నచ్చేయడంతో ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పాడట.

దీంతో ఓంకార్ మాస్ అంశాలతో పాటు కొన్ని కామెడీ సన్నివేశాలు ఉండేలా కథను అల్లుతున్నాడట. సినిమా కథ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తెరకెక్కుతుందని సమాచారం. శ్రీనివాస్ ప్రస్తుతం సాక్ష్యం షూటింగ్ మెయిన్ షెడ్యూల్ లో చాలా బిజీగా ఉన్నాడు. ఇక ఓంకార్ కూడా ఫుల్ స్క్రిప్ట్ ని చాలా ఫాస్ట్ గా ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. మరి ఈ కలయిక ఎప్పుడు ఒకటవుతుందో చూడాలి.