Begin typing your search above and press return to search.

నాగ్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ సూపర్!

By:  Tupaki Desk   |   10 Jan 2017 4:26 AM GMT
నాగ్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ సూపర్!
X
భక్తిరస చిత్రాల్లో నటించి "అన్నమయ్య"తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగార్జున అప్పట్లో అందరికీ షాకిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాకు అద్భుతమైన ఆదరణ లభించింది! అనంతరం రామదాసు, షిరిడీ సాయి వంటి సినిమాల్లో నటించి మెప్పించినా సుమారు 20ఏళ్ల క్రితం వచ్చిన అన్నమయ్య రేంజ్ మాత్రం ప్రత్యేకం. అయితే మరోసారి ఆ సినిమాను గుర్తుచేస్తుంది తాజా "ఓం నమో వెంకటేశాయ". ఈ సినిమా ట్రైలర్ చూస్తే నాటి అన్నమయ్య క్రేజ్ ని మళ్లీ రిపీట్ చేయడానికి జరిగిన ప్రయత్నంలా అనిపించకమానదు!! ఆ సంగతులు అలా ఉంటే తాజాగా విడుదలయిన ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలేమైనా పెంచిందా అనే సంగతి కాసేపు పక్కనపెడితే... ఈ సినిమాతో నిర్మాత జేబులు మాత్రం ఫుల్ గా నిండాయని, ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ కార్యక్రమాలు పూర్తయ్యాయని తెలుస్తోంది.

ఈ మధ్యకాలంలో సోగ్గాడే చిన్నినాయనా, ఊపిరి సక్సెస్ లతో మాంచి ఊపు మీదుండటం.. మరోపక్క అన్నమయ్య ఎఫెక్ట్.. దానికి తోడు వెంకటేశ్వరస్వామి భక్తకోటి మొదలైన విషయాలన్నీ పరిగణలోకి తీసుకున్నారో ఏమో కానీ ఈ సినిమా హక్కులకు భారీ మొత్తం చెల్లించినట్టు తెలుస్తోంది. రెగ్యులర్ మాస్ కమర్షియల్ సినిమా స్థాయిలో ఈ భక్తి చిత్రం బిజినెస్ జరిగిందని అని అంటున్నారు. కేవలం డిస్ట్రిబ్యూషన్‌ ద్వారానే ఈ చిత్రానికి సుమారు ముప్పై ఐదు కోట్లకి పైగా బిజినెస్‌ జరిగిందట! దీనికి తోడు ఈటీవీ సంస్థ పన్నెండున్నర కోట్లు పెట్టి శాటిలైట్‌ రైట్స్ తీసేసుకుంది. దీంతో.. సినిమా ఫలితం ఎలాఉన్నా కానీ ఇప్పటికే నిర్మాత జేబులైతే బాగానే నిండాయని చెప్పుకోవచ్చు! ఈలెక్కన చూసుకుంటే విడుదల అనంతరం నలభై కోట్ల బిజినెస్‌ చెయ్యగలిగే చాలు బయ్యర్లకీ ఆ వెంకటేశ్వర స్వామి సంతోషాన్ని అందించినట్లే!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/