Begin typing your search above and press return to search.

‘నమో వెంకటేశాయ’ ఫస్ట్ లుక్ అప్పుడేనా..

By:  Tupaki Desk   |   28 July 2016 11:56 AM GMT
‘నమో వెంకటేశాయ’ ఫస్ట్ లుక్ అప్పుడేనా..
X
నిన్నో మొన్నో షూటింగ్ మొదలుపెట్టినట్లుగా ఉంది. అంతలోనే ఫస్ట్ లుక్ పోస్టర్ అంటోంది ‘నమో వెంకటేశాయ’ టీమ్. రాఘవేంద్రరావు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున కథానాయకుడిగా ఈ నెల రెండో తారీఖునే ‘ఓం నమో వెంకటేశాయ’ సినిమా సెట్స్ మీదికి వెళ్లింది. అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ఆలయం సెట్టింగ్ లో షూటింగ్ మొదలైంది. తొలి షెడ్యూల్ పూర్తయ్యాక కొంచెం గ్యాప్ తీసుకున్న ‘ఓం నమో వెంకటేశాయ’ టీమ్.. ఈ రోజే ఫస్ట్ లుక్ గురించి ట్విట్టర్లో వెల్లడించింది. ఇంకో రెండు రోజుల్లో ఫస్ట్ లుక్ రిలీజవుతుందని.. స్వామి తొలి దర్శనానికి రెడీగా ఉండాలని ఈ సినిమా కోసం ప్రత్యేకంగా క్రియేట్ చేసిన ట్విట్టర్ అకౌంట్లో వెల్లడించారు.

ఐతే స్వాతి తొలి దర్శనం అంటున్నారంటే ఫస్ట్ లుక్ పోస్టర్ నాగార్జునదా లేక ఈ సినిమాలో వెంకటేశ్వరస్వామిగా నటిస్తున్న టీవీ నటుడిదా అని డౌటు. ఇంతకుముందు రిలీజ్ చేసిన ‘ఓం నమో వెంకటేశాయ’ లోగో విషయంలో అంత మంచి ఫీడ్ బ్యాక్ రాలేదు. టైటిల్ లోగో చాలా సాధారణంగా ఉందన్నారు జనాలు. మరి ఫస్ట్ లుక్ పోస్టర్ ఎలా ఉంటుందో చూడాలి. అన్నమయ్య.. శ్రీరామదాసు.. షిరిడిసాయి తర్వాత రాఘవేంద్రరావు-నాగార్జున కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది. ‘షిరిడిసాయి’ నిర్మాత మహేష్ రెడ్డే ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నాడు. కీరవాణి సంగీతాన్నందిస్తున్నాడు. ఇందులో ప్రగ్య జైశ్వాల్.. అనుష్క కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఐతే అనుష్క నాగార్జునకు జోడీ మాత్రం కాదని రాఘవేంద్రరావు వెల్లడించారు. మరి ప్రగ్యా సంగతేంటో తెలియదు.