Begin typing your search above and press return to search.

పాత పాటలన్నీ భలే పాడు చేశారే

By:  Tupaki Desk   |   19 March 2018 11:30 PM GMT
పాత పాటలన్నీ భలే పాడు చేశారే
X
సూపర్ హిట్ క్లాసిక్ సాంగ్స్ ను కొత్తగా అందించి.. ఆడియన్స్ అటెన్షన్ పట్టేయాలని ఫిలిం మేకర్స్ ఆతృత అర్ధమవుతూనే ఉంటుంది. కానీ అలనాటి మ్యాజిక్ ని రిపీట్ చేయడం కష్టం అనే సంగతి పదేపదే ప్రూవ్ అవుతున్నా సరే.. మళ్లీ అదే మాదిరిగా ప్రయత్నించేస్తూ.. చరిత్ర సృష్టించిన గీతాలను భ్రష్టు పట్టించేస్తుంటారు.

బాఘీ2 మూవీలో తేజాబ్ లోని 'ఏక్ దో తీన్' సాంగ్ ను రీమేక్ చేసిన విషయం తెలిసిందే. సాంగ్ టీజర్ రిలీజ్ చేసినప్పుడే డౌట్స్ కొట్టగా.. ఇప్పుడీ లిరిక్ పూర్తిగా బయటకు వచ్చాక.. అసలు విషయం మొత్తం అర్ధమయిపోయింది. ఒరిజినల్ లిరిక్ కి వందో వంతు కూడా న్యాయం చేయలేకపోయారనే కామెంట్స్ బోలెడన్ని వినిపిస్తున్నాయి. మాధురి దీక్షిత్ తన డ్యాన్స్ కు తోడు హావభావాలు.. చెణుకులతో ఆడించిన సయ్యాటను.. కొంచెం కూడా రెప్లికేట్ చేయలేకపోయింది జాక్వెలిన్.

ఇలా బాలీవుడ్ సూపర్ హిట్ ఓల్డ్ సాంగ్స్ ను పాడుపాడు చేసేయడం కొత్తేమీ కాదు. ఆషికి ముూవీ నుంచి 'ధీరే ధేరీ సే మేరీ జిందగీ' అంటూ సాగే పాటను.. గుల్షన్ కుమార్ కు ట్రిబ్యూట్ అంటూ టీ-సిరీస్ కొత్త వెర్షన్ తయారు చేస్తామన్నపుడే అందరూ వద్దని చెప్పారు. హృతిక్ రోషన్.. సోనమ్ కపూర్ నటించినా సరే.. ఈ పాటను ఎవరూ మెచ్చలేకపోయారు.

హరే రామ హరే కృష్ణ లోని 'దమ్ మారో దమ్' ఎంతటి హిట్ అనే సంగతి చెప్పాల్సిన పని లేదు. దీపికా పదుకొనే ఇరగదీసి డ్యాన్స్ చేసినా రే అలరించలేకోవడం చెప్పుకోవాల్సిన విషయం. బ్లాక్ మెయిల్ మూవీలో 'పల్ పల్ దిల్ కే పాస్' సాంగ్ ఆల్ టైం ఛార్ట్ బస్టర్. ఇదే పాటను వజయ్ తుమ్ హో'లో రీమిక్స్ చేసి నానా యాగీ చేసి పారేశారు.

డార్లింగ్ డార్లింగ్ లోని 'దిల్ మే చుపా లూంగా' పాటను కూడా వజహ్ తుమ్ హో మూవీలో ఇష్టం వచ్చినట్లు వాడి పాడేశారు. పడోసాన్ లోని 'చతుర్ నార్' పరిస్థితి కూడా ఇదే. మెషీన్ మూవీలో ఈపాటను రీమిక్స్ చేసి.. రచ్చ రచ్చ చేసిన విధానం ఒక్కరినీ మెప్పించలేదు. పాత పాటలన్నీ పాడు చేసేయాలని బాలీవుడ్ కంకణం కట్టుకున్నట్లుగా కనిపిస్తోంది.