Begin typing your search above and press return to search.

తమ్ము-విశాల్ హాట్ హాట్ డ్యాన్సులు

By:  Tupaki Desk   |   28 Oct 2016 4:30 PM GMT
తమ్ము-విశాల్  హాట్ హాట్ డ్యాన్సులు
X
తమిళ హీరో విశాల్.. మిల్కీ బ్యూటీ తమన్నాలు జంటగా నటించిన కత్తి సాందాయ్.. తెలుగు వెర్షన్ ఒక్కడొచ్చాడు పై బాగానే కాన్సంట్రేట్ చేసింది. ఏదో తెలుగులోకి డబ్బింగ్ చేస్తున్నారంటే.. రిలీజ్ కి రెండు మూడు రోజులు హంగామా చేసేయడం అనే పాత పద్ధతికి గుడ్ బై చెప్పేసింది యూనిట్. తమిళ్ తోపాటు సమానంగా.. సాంగ్ ప్రోమోలు.. ఫస్ట్ లుక్స్.. టీజర్.. మేకింగ్ వీడియోలు.. ఇలా అన్నిటినీ తమిళ్ తో పాటు తెలుగులోనూ రిలీజ్ చేస్తూ హంగామా చేస్తున్నారు. తమన్నా ఈ మూవీలో మెయిన్ హీరోయిన్ కావడాన్నే ఇందుకు రీజన్ గా చెప్పుకోవచ్చు.

మిల్కీ కూడా ఈ సినిమా కోసం ఎక్కడా తగ్గట్లేదు. రీసెంట్ గా రిలీజ్ చేసిన 'దిల్ చాహ్ తా హై తమన్నా' మేకింగ్ వీడియోలో స్టెప్పులు అదరగొట్టేసిందంతే. కుర్ర హీరో విశాల్ కూడా డ్యాన్సులు కుమ్మేస్తున్నా.. స్టెప్స్ విషయంలో తమన్నా ముందు విశాల్ తేలిపోతున్నాడని చెప్పాలి. ఫైట్ మాస్టర్ చేసి చూపించిన స్టెప్స్ ని.. అదిరిపోయే రేంజ్ లో వేస్తూ రెచ్చగొట్టేస్తోంది తమన్నా. విశాల్ తో కలిసి హాట్ హాట్ మూవ్స్ ఇవ్వడంలో రెచ్చిపోయింది తమ్మూ.

ఎలాంటి స్టెప్పులనైనా అలవోకగా వేసేయగలనని ప్రూవ్ చేసుకున్న మిల్కీ.. గ్లామర్ ఒలకబోస్తూ.. ఈ రేంజ్ లో డ్యాన్సులు వేయడం చూస్తుంటే.. మాస్ రచ్చ మామూలుగా ఉండదనుకుంటా!



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/