Begin typing your search above and press return to search.

మెగా ప్రిన్సెస్ సోలోగా బ‌రిలోకి..

By:  Tupaki Desk   |   25 May 2016 1:41 PM GMT
మెగా ప్రిన్సెస్ సోలోగా బ‌రిలోకి..
X
మెగా ప్రిన్సెస్ నీహారిక‌కు పోటీయే వ‌ద్ద‌ట‌.. ఆమె సింహంలాగా సింగిల్ గా వ‌స్తుంద‌ట‌.. అందుకే ఇప్పుడిప్పుడే కాకుండా నెల త‌ర్వాత థియేట‌ర్ల‌లోకి రావాల‌ని ఫిక్స‌యింది కొణిదెల వార‌మ్మాయి. నీహారిక హీరోయిన్ గా ప‌రిచ‌యం కాబోతున్న ‘ఒక మ‌న‌సు’ విడుద‌ల తేదీని ఈ రోజే ప్ర‌క‌టించాడు నిర్మాత మ‌ధుర శ్రీధ‌ర్ రెడ్డి. జూన్ 24న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

ముందు ఈ సినిమాను జూన్ 10నే రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు వార్త‌లొచ్చాయి. ఐతే ఆ రోజు సందీప్ కిష‌న్ ‘ఒక్క అమ్మాయి త‌ప్ప‌’.. సుమంత్ అశ్విన్‘ రైట్ రైట్’.. కూడా రిలీజ్ కాబోతున్నాయి. వాటికి ఇప్ప‌టికే బెర్తులు క‌న్ఫ‌మ్ అయ్యాయి. అవి రెండు చిన్న సినిమాలే అయినా పోటీ ఉంటే.. ఫోక‌స్ పోతుందేమో అనుకున్నారేమో ఒక మ‌న‌సును వాయిదా వేశారు. త‌ర్వాతి వారం నాని సినిమా ‘జెంటిల్ మ‌న్’ విడుద‌ల‌వుతున్న నేప‌థ్యంలో త‌ర్వాతి వారం సోలోగో రిలీజ్ చేయాల‌ని ఫిక్స‌య్యారు.

‘మ‌ల్లెల‌తీరంలో సిరిమ‌ల్లెపువ్వు ఫేమ్ రామ‌రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ‘ఒక మ‌న‌సు’ను మ‌ధుర శ్రీధ‌ర్.. టీవీ9 భాగ‌స్వామ్యంతో నిర్మించాడు. నాగ‌శౌర్య‌-నిహారిక జంట‌గా న‌టించిన ఈ సినిమాకు సునీల్ క‌శ్య‌ప్ సంగీతాన్నందించాడు.