Begin typing your search above and press return to search.

ఓంకార్ కోసం పీవీపీ వ‌చ్చాడు

By:  Tupaki Desk   |   25 Aug 2016 4:45 PM GMT
ఓంకార్ కోసం పీవీపీ వ‌చ్చాడు
X
బుల్లితెర‌పై యాంక‌ర్ గా అభిమానుల‌తో పాటు హేట‌ర్స్ ను కూడా పెద్ద సంఖ్య‌లోనే సంపాదించుకున్నాడు ఓంకార్. ఆ త‌ర్వాత అనూహ్యంగా ద‌ర్శ‌కుడిగా మారి వెండితెర వైపూ చూశాడు. తొలి ప్ర‌య‌త్నంలో బోల్తా కొట్టినా.. రెండో సినిమా ‘రాజు గారి గ‌ది’తో ఇండ‌స్ట్రీ దృష్టిని ఆక‌ర్షించాడు ఓంకార్. చిన్న సినిమాగా విడుద‌లై పెద్ద విజ‌యం సాధించిన ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ కూడా రాబోతోంది.

ప్ర‌ముఖ నిర్మాత పొట్లూరి వ‌ర‌ప్ర‌సాద్ ఈ ప్రాజెక్టులో భాగ‌మ‌వుతుండ‌టం విశేషం. ‘రాజుగారి గ‌ది’ సీక్వెల్ ను సీనియ‌ర్ హీరో వెంక‌టేష్ తో చేయాల‌ని ఆశ‌ప‌డుతున్నాడు ఓంకార్. ఐతే హీరో ఆయ‌నేనా కాదా అన్న‌ది ఇంకా ఫైన‌లైజ్ కాలేదు. ఈ లోపు పీవీపీ భాగ‌స్వామ్యంతో ఈ సినిమా స్కేల్ బాగా పెరిగింది. రాజుగారి గ‌ది ఫ‌స్ట్ పార్ట్ ప్రొడ్యూస్ చేసిన మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్.. ఓక్ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ‌ల‌తో క‌లిసి పీవీపీ ఈ చిత్రాన్ని నిర్మిస్తాడు. తొలి భాగానికి స‌పోర్ట్ ఇచ్చిన వారాహి వాళ్ల హ్యాండ్ ఉంటుందో లేదో తెలియ‌దు.

ఓంకార్ తో కొలాబ‌రేట్ అవుతున్న విష‌యాన్ని వెల్ల‌డిస్తూ పీవీపీ ఓ ప్రెస్ నోట్ ఇచ్చారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు.. నటీనటులు.. టెక్నిషియన్స్ వివరాలు తెలియజేస్తామని పీవీపీ చెప్పారు. ‘బ్ర‌హ్మోత్స‌వం’ త‌ర్వాత రెండు నెల‌లు సైలెంటుగా ఉన్న పీవీపీ.. ఇటీవ‌లే మ‌హేష్ పుట్టిన రోజు సంద‌ర్భంగా అత‌డితో కొత్త సినిమా అనౌన్స్ చేశారు. ఇప్పుడు ‘రాజుగారి గ‌ది’ సీక్వెల్ లో భాగస్వామి అయ్యారు.