Begin typing your search above and press return to search.

ఆర్ ఆర్ ఆర్ ఆఫ‌ర్‌ తో లేడీ లాయ‌ర్‌ కు 50 ల‌క్ష‌ల టోక‌రా!

By:  Tupaki Desk   |   19 July 2019 7:05 AM GMT
ఆర్ ఆర్ ఆర్ ఆఫ‌ర్‌ తో లేడీ లాయ‌ర్‌ కు 50 ల‌క్ష‌ల టోక‌రా!
X
ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తాన‌న్న ఓ వ్య‌క్తి ఓ లేడీ లాయ‌ర్‌ కు రూ.50 ల‌క్ష‌ల‌కు టోక‌రా వేశాడు. బంజారా హిల్స్‌ కలర్ ల్యాబ్‌ లో అసిస్టెంట్‌ గా పనిచేస్తున్న వి.నరేష్ కుమార్ తనను తాను చిత్ర నిర్మాత ఆదిత్యగా బోయనపల్లి ప్రాంతానికి చెందిన 73 ఏళ్ల మహిళ‌ను పరిచయం చేసుకున్నాడు. ఆమె హైదరాబాద్ కోర్టులో న్యాయవాది. తన విడాకుల సూచనల కోసం నరేష్ కుమార్ తరచూ ఆమెను పిలిచేవాడు.

తను ఆర్ ఆర్ ఆర్ సినిమా నిర్మాతలలో ఒకడు అని ఆమెను నమ్మించాడు. తరువాత, RRRలో మీకు ఛాన్స్ ఇస్తాన‌ని ఆమెను న‌మ్మించాడు. స్క్రీన్ పరీక్షలు మరియు ఇతర ఫార్మాలిటీల కోసం కొంత మొత్తాన్ని చెల్లించమని కోరాడు. ఇంకేముందు రాజ‌మౌళి సినిమాలో ఛాన్స్ క‌దా అని ఆమె ఉబ్బిత‌బ్బ‌య్యింది. ఆ లేడీ అతని ఉచ్చులో పడి మొత్తం రూ. 50 లక్షలు చెల్లించింది.

కొద్ది రోజుల తరువాత - షూటింగ్ షెడ్యూల్ మరియు ఆమె పాత్ర వివరాలను ఇవ్వమని ఆమె కోరింది. అతను ఆమె నుంచి తప్పించుకోవ‌డం మొదలుపెట్టాడు. చివరికి అతని మొబైల్ స్విచ్ ఆఫ్ చేశాడు. దీంతో ఆమెకు అనుమానం రేకెత్తించింది. వెంట‌నే ఆమె బోయనపల్లి పోలీస్ స్టేషస్‌ ను సంప్రదించింది. త‌న‌కు జ‌రిగిన మోసంపై ఫిర్యాదు చేయ‌గా కేసు నమోదైంది మరియు పోలీసులు ఆ మాయగాడి కోసం వెతుకుతున్నారు.