Begin typing your search above and press return to search.

సినిమాకు మించి ఆఫ్ స్క్రీన్ అనుబంధం

By:  Tupaki Desk   |   22 Jun 2017 7:02 AM GMT
సినిమాకు మించి ఆఫ్ స్క్రీన్ అనుబంధం
X

సినిమా వాళ్లకు పెద్దగా అనుబంధాలు ఉండవు.. ఆ సినిమాకు పని చేసినప్పుడు చెప్పినన్ని మాటలు.. ప్యాకప్ చెప్పేశాక మాయమైపోతూ ఉంటాయని అనుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు.. కొందరి విషయంలో ఇది వాస్తవమే అయినా.. సినిమాలకు మించిన అనుబంధాన్ని కొనసాగించే వారు కూడా ఉంటారు.

పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ ఫ్రెండ్ షిప్ గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. గోకులంలో సీత టైంలోరైటర్ గా ఉన్న త్రివిక్రమ్.. జల్సాతో పవన్ కు మొదటిసారి డైరెక్షన్ వహించాడు. అక్కడి నుంచి వీరి రిలేషన్ కంటిన్యూ అవుతూనే ఉంది. అత్తారింటికి దారేది.. ప్రస్తుతం మరో సినిమా కోసం వీరి ప్రయాణం కొనసాగుతున్నా.. అంతకుమించిన సన్నిహిత సంబంధాలే వీరిమధ్యన ఉన్నాయని చెప్పచ్చు. సినిమాలకు చెందిన ఫంక్షన్స్ లో ఇద్దరూ కలిసి కనిపిస్తుండడాన్ని ప్రత్యేకించి చెప్పుకోవాలి. జనసేనకు కూడా త్రివిక్రమ్ తెరవెనుక సాయం చేస్తున్నాడని అంటారు.

జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివల మధ్య అనుబంధం కూడా ఇలాంటిందే. బృందావనం టైంలో రైటర్ గా యంగ్ టైగర్ కు పరిచయమయ్యాడు కొరటాల. తమ ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉంటాయని.. తమ కుటుంబాల మధ్య కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఓపెన్ గానే చెప్పాడు ఎన్టీఆర్. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ ఏ స్థాయి సక్సెస్ ను టేస్ట్ చేసిందో కళ్లారా చూశాం.

నిర్మాత అచ్చిరెడ్డి- దర్శకుడు కృష్ణారెడ్డిల మధ్య కూడా ఇంకా అనుబంధం కొనసాగుతూనే ఉంది. సినిమాల కోసమే రిలేషన్ మొదలైనా.. అంతకు మించిన అనుబంధం వీరి మధ్య ఇప్పటికీ కొనసాగుతుండడం విశేషం. ఇలాంటి సన్నిహిత ఫ్రెండ్షిప్ గురించి చెప్పుకునేటపుడు.. బాపు-రమణల గురించి చెప్పకోకపోతే.. తెలుగు సినీ పరిశ్రమ గురించి పూర్తిగా చెప్పిన భావన కలుగదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/