Begin typing your search above and press return to search.

మన హీరోయిన్‌ కు సన్నీ చాలా స్వీట్‌

By:  Tupaki Desk   |   3 May 2016 9:30 AM GMT
మన హీరోయిన్‌ కు సన్నీ చాలా స్వీట్‌
X
టాలీవుడ్ బ్యూటీ మధురిమ.. పేరు మార్చేసుకుని నైరా బెనర్జీగా బాలీవుడ్ లో అడుగు పెడుతోంది. అయితే.. ఇక్కడ ఐటెం సాంగ్స్ వరకూ చేసిన అనుభవం ఉన్న నైరా.. ఇప్పుడు బాలీవుడ్ లో ఏకంగా అడల్ట్ కంటెంట్ మూవీలో నటించేస్తోంది. అది కూడా పోర్న్ స్టార్ సన్నీలియోన్ మూవీ 'వన్ నైట్ స్టాండ్' కావడంతో.. నైరా బెనర్జీ పేరు బాలీవుడ్ లో మార్మోగిపోతోంది.

అసలే అడల్ట్ కంటెంట్ మూవీ.. పైగా సన్నీలియోన్ తో కలిసి నటించడం అంటే.. అందుకు బాగానే గట్స్ ఉండాలి. ఇలాంటివి చాలానే ఉన్న నైరా.. సన్నీతో కలిసి నటించడంపై తన స్టైల్ లో స్పందించింది. 'ఒకే సారి రెండు ఎద్దులను పరిగెట్టిస్తే ఏమవుతుంది. రెండూ కలిసిపోయి పరిగెడతాయ్ అంతే. నిజానికి సన్నీ లియోన్ చాలా నిజాయితీ గల వ్యక్తి. నాకు గాయాలు అయినపుడు.. కొన్ని సీన్స్ యాక్ట్ చేసి చూపించింది. అది చూసి నేను కదిలిపోయాను. ప్రొఫెషనల్ గా సన్నీ లియోన్ స్వీట్ అండ్ సూపర్ అంతే' అంటోంది నైరా బెనర్జీ.

వన్ నైట్ స్టాండ్ మూవీలో నటించేందుకు ముందు సంకోచించిందట నైరా. కానీ.. జెండర్ ఈక్వాలిటీ పై దర్శకురాలు జాస్మిన్ డిసౌజాకు ఉన్న క్లారిటీ, సబ్జెక్ట్ ని ఆమె నేరేట్ చేసిన తీరు చూసి.. వెంటనే ఒప్పుకున్నానని అంటోంది నైరా బెనర్జీ అలియాస్ మధురిమ.