Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: సరూర్ నగర్ సత్తా

By:  Tupaki Desk   |   23 April 2019 6:06 AM GMT
ట్రైలర్ టాక్: సరూర్ నగర్ సత్తా
X
తెలంగాణా రాష్ట్రం వచ్చాక ఆ నేపధ్యాన్ని యాసను ప్రత్యేకంగా చూపిస్తున్న సినిమాలకు మంచి ఆదరణ దక్కుతోంది . కాకపోతే అవుట్ అండ్ అవుట్ హీరోయిజంతో ఇంత వరకు ఎవరూ ట్రై చేయలేదు. ఆ వరసలో డిఫరెంట్ అటెంప్ట్ తో వస్తున్న సినిమా నువ్వు తోపు రా. సుధాకర్ కొమకుల హీరోగా నిత్య శెట్టి హీరొయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ప్రభాస్ చేతుల మీదుగా విడుదల చేశారు.

కంటెంట్ విషయానికి వస్తే హైదరాబాద్ సరూర్ నగర్ లో పుట్టి పెరిగిన ఓ కుర్రాడు(సుధాకర్)అతని బాషలోనే చెప్పాలంటే జిందగీని మస్త్ ఎంజాయ్ చేస్తుంటాడు. తల్లి(నిరోషా)అంటే ఆడికి ప్రాణం. దోస్తులతో తిరగడం మనసుకు నచ్చిన పోరికి ఐ లవ్ యు చెప్పడం ఇదే అతని దినచర్య. తన చదువుకు సిటీలో ఉద్యోగం రావడమే గొప్ప అనుకుంటే ఏకంగా అమెరికా వెళ్ళే ఛాన్స్ వస్తుంది.

కాని అక్కడికి వెళ్ళాక లైఫ్ అంత ఈజీగా ఉండదు. ఏదైనా ముక్కుసూటిగా వెళ్ళే తత్వం అక్కడ చిక్కులు తెచ్చి పెడుతుంది. ఒక్క రోజులో పూర్తి చేయాల్సిన ప్రమాదకరమైన మిషన్ ఒకటి నెత్తి మీద పడుతుంది. మరి ఈ సరూర్ నగర్ పోరడు అది ఎలా సాధించాడు అమ్మకు ఊరికి పేరు తెచ్చి తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు అనేదే నువ్వు తోపు రా

హీరో క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్ గా ఉంది. అగ్రెసివ్ గా చూపిస్తూ అతని బాష మొత్తం తెలంగాణా స్లాంగ్ లో ఉంచడంతో కొత్తగా అనిపిస్తుంది. పెర్ఫార్మన్స్ పరంగా సుధాకర్ కొమాకుల చాలా ఈజ్ తో నటించాడు. డైలాగ్ డెలివరీలోనూ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. సింపుల్ గా చెప్పాలంటే ఇది అతని వన్ మ్యాన్ షో. అందుకే హీరొయిన్ నిత్య శెట్టి సైతం సైడ్ లైన్ అయ్యేలా డామినేట్ చేశాడు.

అజ్జు మహంకాళి సంబాషణలు చురుకుగా తెలంగాణా నేటివిటీకి అద్దం పడుతూ యూత్ కనెక్ట్ అయ్యేలా బాగా పేలాయి. సురేష్ బొబ్బిలి-పిఎ దీపక్ సంగీతం సింక్ అయ్యింది. ప్రకాష్ వేలాయుధన్-వెంకట్ సి దిలీప్ ఛాయాగ్రహణం కథకు తగ్గ మూడ్ ని చక్కగా క్యారీ చేసింది. యునైటెడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై బి హరినాథ్ బాబు దర్శకత్వంలో శ్రీకాంత్ నిర్మించిన నువ్వు తోపు రాలో అన్ని మసాలాలు సమపాళ్లలో బాగానే మిక్స్ చేసినట్టు కనిపిస్తోంది. నిరోషా-జెమిని సురేష్ మినహా సీనియర్ ఆర్టిస్టులు పెద్దగా ఎవరు ఉన్నట్టు లేరు. మొత్తానికి విషయం ఉందనిపించేలా ట్రైలర్ కట్ చేసిన నువ్వు తోపు రా టీం టైటిల్ కు ఎంత వరకు న్యాయం చేసిందో తెలియాలంటే విడుదల అయ్యే దాకా ఆగాల్సిందే