Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ నెక్స్ట్ టార్గెట్ ?

By:  Tupaki Desk   |   24 Jun 2018 6:02 AM GMT
బిగ్ బాస్ నెక్స్ట్ టార్గెట్ ?
X
న్యాచురల్ స్టార్ నాని హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ 2 షోలో మసాలా మెల్లగా పెరుగుతోంది. ఫస్ట్ వీక్ మిశ్రమ స్పందన వచ్చినా పార్టిసిపెంట్స్ మధ్య మెల్లగా డ్రామా మొదలు కావడంతో ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. వీక్ డేస్ లో ఎలా ఉన్నా అధిక శాతం షో ఫాలోయర్స్ చూసేది మాత్రం వీక్ ఎండ్ ఎపిసోడ్స్. దానికి కారణాలు రెండు. ఒకటి యాంకర్ వచ్చేది ఆ రెండు రోజులు మాత్రమే. మరొకటి ఎలిమినేషన్ ప్రక్రియ చాలా ఆసక్తికరంగా ఉంటుంది కనక. గతవారం సంజనా వెళ్లిపోయింది కాబట్టి ఈసారి ఎవరా అనే ఆసక్తి ఉండటం సహజం.

విశ్వసనీయ సమాచారం మేరకు నూతన్ నాయుడు ఉండవచ్చని తెలిసింది. దానికి తగ్గట్టు లీకైన కొన్ని విజువల్స్ లో నాని పక్కన నూతన్ నాయుడు మైకు పట్టుకుని ఉన్నట్టు కనిపించడంతో హౌస్ వదిలి కేవలం ఎలిమినేషన్ టైంలో మాత్రమే బయటికి వస్తారు కాబట్టి నూతన్ వెళ్ళడాన్ని ఖరారు చేస్తున్నారు. కానీ ఏదో ఒక ట్విస్ట్ బిగ్ బాస్ ఇచ్చునంటాడని నూతన్ నాయుడు కన్ఫెషన్ రూమ్ నుంచి మళ్ళి స్టోర్ రూమ్ కి వెళ్లినట్టు మరోవార్త కూడా ప్రచారంలోకి తెస్తున్నారు.

ఓట్ల విషయంలో కూడా చాలా ఎగ్జైట్మెంట్ నెలకొంది. దీప్తి సునయన ఇప్పటికీ టాప్ రాంక్ లో కొనసాగుతుండగా 3 కోట్ల దాకా ఓట్లు తెచ్చుకుని సోషల్ మీడియాలో తన ఫాలోయింగ్ తో పాటు పాపులారిటీని కూడా రుజువు చేసింది. తనకు నచ్చిన పనులు మాత్రమే చేసే ధోరణితో బాబు గోగినేని కూడా మంచి ఆధిపత్యంలో ఉన్నాడు. కౌశల్ దూకుడు తత్వం గీతా మాధురి టీవీ 9 దీప్తి పెర్ఫార్మన్స్ తేజస్విని ఎమోషన్స్ అన్ని రకాలుగా వాళ్ళను సేఫ్ గార్డ్ చేస్తున్నాయి. సో గణేష్ నూతన్ ల మధ్యే పోటీ నెలకొంది. మంచి ఈజ్ తో ఎక్కువ వివాదాలు గొడవలు లేకుండా ఉన్న గణేష్ మీద కొంత సాఫ్ట్ కార్నర్ నెలకొని ఉంది. దానికి తోడు నూతన్ నాయుడు తనీష్ తో పడిన గొడవ కూడా బిగ్ బాస్ లెక్కల్లో మైనస్ గా మారినట్టు తెలిసింది.

ఒక కామన్ విమెన్ ఇప్పటికే వెళ్లిపోయింది. ఇప్పుడు నూతన్ కూడా వెళ్ళిపోతే గణేష్ ఒక్కడే కామన్ మ్యాన్ గా మిగులుతాడు. చివరికి చూస్తూనే సెలెబ్రిటీలు మాత్రమే మిగిలేలా ఉన్నారు. ఇంకా 85 రోజుల షో ఉంది కనక ముందు ముందు వైల్డ్ కార్డు ఎంట్రీ రూపంలో కొత్తవాళ్లు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఇప్పుడే ఒక నిర్ణయానికి రాలేం. నూతన్ నాయుడు ఉంటాడా లేదా ఈ రోజు రాత్రి ఎపిసోడ్ తో తేలిపోతుంది.