బాలయ్యకు గట్టి సవాలే

Tue Jan 22 2019 00:00:00 GMT+0530 (IST)

ఎన్టీఆర్ కథానాయకుడు అనూహ్య రీతిలో డిజాస్టర్ కావడం ఇంకో వారం థియేటర్లో ఉంచితే గొప్ప అనేలా వసూళ్లు పడిపోవడం ఎవరూ ఊహించనిది. కనీసం ప్రమోషన్ చేసి అయినా కలెక్షన్లు పెంచుదామా అంటే అసలు ఈ సినిమా చూసే మూడ్ లో జనంతో పాటు అభిమానులు కూడా లేరని తేలిపోవడంతో బాలయ్యతో సహా టీమ్ మొత్తం సైలెంట్ అయ్యింది. ఇప్పుడు మహానాయకుడి మీద ఏమంత హైప్ లేదు. కథానాయకుడు బ్లాక్ బస్టర్ అయ్యుంటే కథ వేరుగా ఉండేది కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. కొంత భాగం రీ షూట్ అవుతోందన్న వార్తలు కూడా వస్తున్నాయి.అదలా ఉంచితే మహానాయకుడు మీద చాల రకాల ఒత్తిళ్లు ఉన్నాయి. అందులో ప్రధానంగా మొదటి భాగంతో వచ్చిన  నష్టాలను పూడ్చడం. అదంత సులభం కాదు. ఎందుకంటే మహానాయకుడు పొలిటికల్ జానర్. మాస్ కానీ ఫ్యామిలీస్ పెద్దగా ఆసక్తి చూపరు. వాళ్ళను మెప్పించే అంశాలు ఇందులో చొప్పించాలి అంటే చాలా కష్టం. పైగా హీరో బాలకృష్ణే కాబట్టి చంద్రబాబు నాయుడుని ఏ కోణంలోనూ ఒక్క శాతం నెగటివ్ గా చూపే ఛాన్స్ లేదని గతంలోనే ప్రచారం జరిగింది. పైగా ఎన్టీఆర్ ను గద్దె దింపే సమయం నుంచి ఆయన కొడుక్కి పిల్లనిచ్చే దాకా బాలయ్య బాబు వెంటే ఉన్నాడు. సో నాదెండ్ల ఇంటర్వ్యూలలో చెప్పిన అంశాలు మొదలుకుని దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు పుస్తకంలో రాసుకున్న దాకా ఏదీ సినిమాలో ఉండదు.

అసలు ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో రక్తి కట్టే డ్రామా ఉండేది రెండో పెళ్లి నుంచే. అసలు ఆ ప్రస్తావనే లేకుండా బాబు అధికారంలో ఎలా వచ్చాడో నిజాలు చూపకుండా మాయ చేస్తే జనం ఒప్పుకోకపోవచ్చు. ఆలా కనెక్ట్ కావడంలో ఫెయిల్ అయితే మహానాయకుడికి చిక్కులు తప్పవు. అసలే లక్ష్మీస్ ఎన్టీఆర్ లో నిజాలు చూపిస్తాను అంటూ వర్మ తెగ ఊదరగొడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఇంత ప్రెజర్ ను తట్టుకోవడం ఈజీ కాదు. అసలే ఎన్టీఆర్ బయోపిక్ కోరి మరీ ప్లాప్ చేసుకున్నారు అనే ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతోంది. దాన్ని కొంతైనా కవర్ చేయాలి అంటే మహానాయకుడు మాములుగా ఉంటే సరిపోదు. చూడాలి క్రిష్ బాలయ్యలు ఏం తీసారో.