Begin typing your search above and press return to search.

బాలీవుడ్ అర్జున్ రెడ్డి మారాడు

By:  Tupaki Desk   |   25 April 2018 7:30 AM GMT
బాలీవుడ్ అర్జున్ రెడ్డి మారాడు
X
యూత్ ను ఆకట్టుకునే స్టోరీ.. పర్ ఫెక్ట్ స్క్రీన్ ప్లేతో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ మూవీ అన్ని ఏరియాల్లో కలెక్లన్లు విపరీతంగా రాబట్టింది. మొదటి సినిమానే అయినా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

అర్జున్ రెడ్డి యూత్ కు బాగా నచ్చే సబ్జెక్టు కావడంతో రీమేక్ రైట్స్ కోసం మంచి డిమాండ్ వచ్చింది. బాలీవుడ్ లో ఈ సినిమా రీమేక్ చేయాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. అర్జున్ కపూర్ ను హీరోగా ఓకే చేయడానికి చాలారోజుల నుంచి ప్రయత్నిస్తున్నారు. అతడు దీనిపై తేల్చిచెప్పడం లేదు. చివరకు ఈ సబ్జెక్టు షాహిద్ కపూర్ వద్దకు చేరింది. అతడు వెంటనే ఓకే అనేయడంతో షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఒరిజినల్ వెర్షన్ డైరెక్ట్ చేసిన సందీప్ వంగానే హిందీలోనూ డైరెక్ట్ చేస్తున్నాడు. మురాద్ ఖేతాని.. అశ్విన్ వార్డే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

అర్జున్ రెడ్డి తమిళంలో కూడా రీమేకవుతోంది. హీరో విక్రమ్ కొడుకు ధ్రువ్ ఈ సినిమాతో కోలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. ఈ మూవీ షూటింగ్ కు ముందు ధ్రువ్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. కొన్నాళ్ల తరవాత అర్జున్ రెడ్డిని ఇంకో రెండు భాషల్లోనూ చూడొచ్చన్న మాట.