Begin typing your search above and press return to search.

లుక్ తో పాటు లక్ ఉంటేనే డిమాండ్

By:  Tupaki Desk   |   31 July 2015 2:02 PM GMT
లుక్ తో పాటు లక్ ఉంటేనే డిమాండ్
X
ఇప్పుడు సినిమాల్లో ఐటెం సాంగ్ కంపల్సరీ అయిపోయింది. చిన్న సినిమా, భారీ బడ్జెట్ ఎలాంటి వేరియేషన్స్ లేవు ఐటెం నెంబర్స్‌ కి. ప్రతీ సినిమాలోనూ ఇలాంటి పాటలు కనిపిస్తున్నా... కొందరికి మాత్రమే మాంచి క్రేజ్ దక్కుతోంది. వాళ్లుంటే సినిమా హిట్టే అనే క్రేజ్ వస్తోంది. అసలే సినిమా రంగంలో సెంటిమెంట్స్ ఎక్కువ. దీంతో ఈ భామలకు డిమాండ్ పెరుగుతోంది. లేటెస్ట్ గా హంసానందిని ఏ రేంజ్ కి చేరుకుందో అందరికీ తెలుసు. మిర్చి నుంచి అత్తారింటికి వరకూ అమ్మడు చిందేసిన ప్రతీ సినిమా సూపర్ హిట్టే. అంతకుముందు ఇలాంటి క్రేజ్ దక్కించుకున్న భామ ముమైత్ ఖాన్.

లేటెస్ట్ గా అలాంటి క్రేజ్ దక్కించుకున్న ఐటెం భామ నోరా ఫతేహి. నడుం ఒంపులు, మెలికలతో టెంపర్ లో వేసిన డ్యాన్స్ లకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తర్వాత బాహుబలిలోనూ మనోహరా సాంగ్ లో ఆడిపాడింది. ఇది కూడా హిట్ అయ్యేసరికి, నోరాకి గోల్డెన్ లెగ్ అని పేరొస్తోంది. త్వరలో విడుదల కానున్న కిక్‌2 లోనూ రవితేజతోనూ చిందేసింది. తర్వాత కళ్యాణ్ రామ్ మూవీ 'షేర్‌' లోనూ ఐటెంసాంగ్ చేస్తోంది. ఇవి రెండూ కూడా హిట్టయితే.. ఇక ఐటెం నెంబర్ల లో టాప్ ప్లేస్ ఈమెదే. మన ఇండస్ట్రీలో లేటెస్ట్ లక్కీ ఐటెం నోరా ఫతేహి అనుకోవచ్చు.