Begin typing your search above and press return to search.

మనోహరి బెల్లీ డ్యాన్స్ కేకలే

By:  Tupaki Desk   |   23 March 2018 7:24 PM GMT
మనోహరి బెల్లీ డ్యాన్స్ కేకలే
X
ఐటెమ్ సాంగ్స్ చేసే భామలంటే కేవలం అందాల ఆరబోత అనే ఒక నేమ్ ఉంది. కానీ వారిలో చాలా మందికి తెలియని ఒక కళ కూడా ఉంటుంది. దాన్ని గమనించిన వారు వారిని గౌరవించకుండా ఉండలేరు. ఒకరు ఎంత బాగా డ్యాన్స్ చేసినప్పటికీ అందరికంటే ఎక్కువ స్థాయిలో కొత్తగా చేస్తేనే గుర్తింపు దక్కుతుంది. అలాంటి వారిలో ఓ బ్యూటీ కి మంచి ఇమేజ్ వచ్చింది. నోరా ఫతేహి గురించి అందరికి తెలిసే ఉంటుంది.

టెంపర్ సినిమాతో అలరించి ఆ తరువాత ప్రభాస్ బాహుబలి సినిమాలో మనోహరి సాంగ్ లో కనిపించింది. ముగ్గురిలో ఒకరిగా కనిపించిన ఈ బ్యూటీ ఆ సాంగ్ తరువాత చాలా ఆఫర్స్ అందుకుంది. అయితే ఎలాంటి సాంగ్స్ చేసినప్పటికీ నోరా బెల్లి డ్యాన్స్ లో మాత్రం ఇరగదీస్తుంది. ఆమె బెల్లీ డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో చాలానే ఉన్నాయి. ఇక రీసెంట్ గా మరొక వీడియో కూడా వైరల్ అవుతోంది. బెంగుళూర్ లో ఆ మధ్యన జరిగిన ఫెమీనా డివా ఫంక్షన్లలో అమ్మడు వేసిన స్టెప్పులకు అందరి మతి పోయింది.

బెల్లీ డ్యాన్స్ లో నడుమును కదిలిచడం అంటే సాధారణమైన విషయం కాదు. స్పీడ్ గా వచ్చే మ్యూజిక్ కి తగ్గట్టు డ్యాన్స్ చేయాలి. కానీ ఎలాంటి మ్యూజిక్ వచ్చినా కూడా నోరా చాలా ఈజీగా చేసేస్తోందని ఆ వీడియో ద్వారా చెప్పేసింది. వైట్ డ్రెస్ లో గ్లామర్ వయ్యారాలను కలగలిపి చేసిన ఆ డ్యాన్స్ కు కుర్రకారు మొత్తంగా ఫిదా అయిపోయారు. ఇక మొన్నటి వరకు డ్యాన్సులకే పరిమితమైన ఈ వయ్యారి ఇప్పుడు ఆర్టిస్ట్ గా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్.