వీడియో: బ్యాంకాక్ వీధుల్లో బట్టలమ్ముతోంది!

Tue Jun 11 2019 11:30:14 GMT+0530 (IST)

లేలో లేలో .. పాంచ్ సౌ.. కా మాల్.. సౌ కో లేలో!! ఒక్క నిక్కరు 500 మాత్రమే! అంటూ ఇక్కడ బట్టలమ్ముతున్న ఆవిడవరో గుర్తు పట్టారా?  ఆవిడే బాహుబలి మనోహరి నోరా ఫతేహి. ది గ్రేట్ డ్యాన్సింగ్ స్టార్. ఉన్నట్టుండి తనకి ఎందుకింత కష్టం? అంటారా.. అయితే వివరాల్లోకి వెళ్లాల్సిందే.తెలుగు యువత `బాహుబలి మనోహరి`ని అంత తేలిగ్గా మర్చిపోలేరు. ఒంపు సొంపుల వయ్యారాల్ని వడ్డించడంలో విదేశీ మోడల్ కం డ్యాన్సర్ నోరా ఫతేహి స్పెషాలిటీ ఆ ప్రత్యేక గీతంలో గుర్తించింది ప్రపంచం. కిక్ 2... ఊపిరి చిత్రాల్లోనూ నోరా స్పెషల్ ఐటెమ్ నంబర్లు యూత్ కి కిక్కెక్కించాయి. ఇక బాలీవుడ్ లోనూ ఈ అమ్మడు కెరియర్ పరంగా ఫుల్ బిజీ. ఎప్పుడూ ఏదో ఒక హీటెక్కించే ఎపిసోడ్ తో సామాజిక మాధ్యమాల్లోనూ టచ్ లో ఉంటోంది.

తాజాగా నోరా తన అభిమానుల కోసం ఓ వీడియోని షేర్ చేసి షాకిచ్చింది. నోరా బ్యాంకాక్ మార్కెట్‌లో నేల మీద కూర్చుని ఇలా బట్టలు విక్రయిస్తోంది. ఈ సీన్ లో నోరా ఫుల్ చిలౌట్ లో ఉంది. మేకప్ లెస్ గా ఒరిజినల్ లుక్ లో సేల్స్‌గర్ల్ అవతారం ఎత్తింది. ఆమె చుట్టూ కొన్ని దుస్తులు ఉన్నాయి. అక్కడ దుస్తులను విక్రయిస్తున్న నోరా కొనేవాళ్లతో స్థానిక బాషలోనే మాట్లాడుతోంది. అయితే ఇది నిజమైన సన్నివేశమేనా? ఇంతకీ ఈ సన్నివేశం ఎక్కడ? అంటే `స్ట్రీట్ డ్యాన్సర్ 3డి` సెట్స్ లో. కావాలనే ఇలా ఫన్ క్రియేట్ చేస్తోంది నోరా. రీసెంట్ గా రిలీజైన భారత్ చిత్రంలో నోరా లాటిన్ అమెరికా యువతిగా నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నోరా షేర్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అవుతోంది.

For Video Click Here