Begin typing your search above and press return to search.

బాహుబలి బాంబ్ రెచ్చిపోయిందిలే

By:  Tupaki Desk   |   17 April 2018 5:32 PM GMT
బాహుబలి బాంబ్ రెచ్చిపోయిందిలే
X
వాళ్లు హీరోయిన్స్ గా చేయరు. కానీ ఆ రేంజ్ కంటే ఎక్కువ పాపులారిటీని సంపాదించుకుంటారు. వాళ్లు ఎవరో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఐటమ్స్ సాంగ్స్ స్పెషల్ సాంగ్స్ లో కనిపించే బ్యూటీలు అంటామే వాళ్లే వీళ్లు. ఈ భామలకు ఉండే క్రేజ్ చాలా సపరేట్ అని చెప్పాలి. ఒక్క సాంగ్ లో కనిపించి ఆకట్టుకునే పర్ఫామెన్స్ ఇచ్చారంటే చాలు చాలా బిజీ అయిపోతారు. స్పెషల్ సాంగ్స్ చేసే భామలకు టాలెంట్ చాలా ఉంటుందనే చెప్పాలి.

బ్రేక్ డ్యాన్స్ - మాస్ డ్యాన్స్ అనే కాకుండా ఈ మధ్య మన సైడ్ పాపులర్ అవుతున్న బెల్లి డ్యాన్స్ కూడా వచ్చి ఉంటుంది. అలాంటి టాలెంటెడ్ ముద్దు గుమ్మల్లో నోరా ఫాతేహి ఒకరు. అమ్మడు బాహుబలి పార్ట్ 1 లో మనోహరి అనే సాంగ్ ద్వారా ఆడియెన్స్ కి బాగా దగ్గరైంది. ఆ పాటలో మరో ఇద్దరు ఉన్నా కూడా నోరా వైపే అందరి దృష్టి మళ్లింది. ఇక సోషల్ మిడియలో అమ్మడి డ్యాన్స్ కు సంబంధించిన ఫొటోలు చాలా వైరల్ అవుతుంటాయి. అలాంటి వాటిలో రీసెంట్ గా మరొక వీడియో నెటీజన్స్ ని ఆకట్టుకుంటోంది. ఆమె భలే రెచ్చిపోయింది అంటూ కుర్రాళ్ళు పండగ చేసుకుంటున్నారు.

అలాగే అమ్మడికి డ్యాన్స్ మీద ఉన్న ఇష్టం ఏ రేంజ్ లో ఉందొ అర్థం చేసుకోవచ్చు. నోరా తన మేకప్ మ్యాన్ తో కలిసి స్టెప్పులు వేసుకుంటూ సరికొత్తగా టచ్ అప్ చేసుకుంటోంది. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. నోరా బిగ్ బాస్ ద్వారా ఇప్పటికే మంచి పాపులారిటీ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఇక అప్పుడప్పుడు నార్త్ సౌత్ అని తేడా లేకుండా అవకాశాలు వస్తున్నాయి.

వీడియో కోసం క్లిక్ చేయండి