Begin typing your search above and press return to search.

ఫొటో స్టోరీ: 'మనోహరీ' అందాల ఆరబోత

By:  Tupaki Desk   |   20 March 2018 12:32 PM GMT
ఫొటో స్టోరీ: మనోహరీ అందాల ఆరబోత
X
అందాన్ని ఆరబోయడంలో ఏమాత్రం లోటు చూపని హీరోయిన్లు తక్కువ మంది ఉంటారు. అందులో మొదట ఉండేది మాత్రం నోరా ఫతేహి. హీరోయిన్ కాకపోయినా అంతకుమించిన అందచందాలతో ఐటమ్ సాంగ్స్ లో స్టెప్పులేసే ఈ చిన్నదానికి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువే.

టెంపర్ సినిమాలో ఇట్టాగే రెచ్చిపోదాం అంటూ కుర్రకారుని ఒక ఊపు ఊపేసింది. ఇంకా తన అందాల వల్ల కమ్ముకున్న మైకం నుండి తేరుకోక ముందే బాహుబలిలో ప్రభాస్ పక్కన చిందులేసి మన అందరితో మనోహరీ అంటూ పాడించింది. ఈమధ్యనే ఒక హాట్ ఫోటోషూట్ కి పోజులిచ్చిన నోరాను చూసి అందరూ షాక్ అయిపోతున్నారు. ఆమె అంత అందంగా ఉంది మరి. పల్చటి నలుపు రంగు డ్రెస్ వేసుకుని - ఆమె నడుము వంపుల్ని - సెక్సీ కాళ్ళని చూపిస్తూ కూర్చుని పోజ్ ఇచ్చిన ఈమెను చూస్తే ఎవరైనా చూపు తిప్పుకోలేకపోతున్నారు.

టెంపర్ సినిమా నుండి కేవలం ఐటమ్ సాంగ్స్ కె అంకితం అయిన ఈ కెనడియన్ బ్యూటీ ప్రస్తుతం నివిన్ పాలీ - మోహన్ లాల్ - ప్రియ ఆనంద్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న కయంకులం కోచున్నీ అనే మలయాళం సినిమాలో ఐటమ్ నెంబరుగా చేయబోతోంది. లోఫర్ - కిక్ 2 సినిమాలలో కూడా ఈమె డాన్స్ వేసిన సంగతి తెలిసిందే.