Begin typing your search above and press return to search.

ఊపరి తీసుకుంటున్న టెంపర్‌ బాంబ్‌

By:  Tupaki Desk   |   25 Nov 2015 5:38 AM GMT
ఊపరి తీసుకుంటున్న టెంపర్‌ బాంబ్‌
X
టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున‌, కోలీవుడ్ స్టార్ కార్తీ హీరోలుగా త‌మ‌న్నా క‌థానాయిక‌గా `ఊపిరి` తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. వంశీ పైడిప‌ల్లి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఫ్రెంచి కామెడీ మూవీ ఇన్‌ ట‌చ‌బుల్స్ ఇన్‌ స్పిరేష‌న్‌ తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. అయితే తెలుగు నేటివిటీ, సెన్సిబిలిటీస్‌ కి త‌గ్గ‌ట్టే ఊపిరి చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. నాగార్జున ఈ మూవీలో ఓ ఇంట్రెస్టింగ్ రోల్ పోషిస్తున్నారు. అయితే ఇలాంటి డిఫ‌రెంట్ మూవీలో ఓ ఐటెమ్ నంబ‌ర్ ఉంటే ఎలా ఉంటుంది? అని ఆలోచించిన యూనిట్ విదేశీ ముద్దుగుమ్మ.. టెంపర్‌ బాహుబలిల ఐటెం బాంబ్‌.. నోరా ప‌థేహీని రంగంలోకి దించుతున్నారు.

ప్ర‌స్తుతం నోరాపై ఓ ఐటెమ్ నంబ‌ర్‌ ని తెర‌కెక్కించే ప‌నిలో ఉన్నారు. నోరాతో క‌లిసి కార్తీ కూడా స్టెప్పులేస్తాడ‌ట. కంపోజర్‌ గోపీ సుంద‌ర్ అదిరిపోయే పెప్పీ ఐటెమ్ నంబర్‌ ని రెడీ చేశాడు. వాస్త‌వానికి ఈ ఐటెమ్ నంబ‌ర్ ఒరిజిన‌ల్ మూవీలో లేక‌పోయినా .. తెలుగు వారి సెన్సిబిలిటీస్ ప్ర‌కారం ఈ సాంగ్ ఉండాల్సిందేనని ద‌ర్శ‌క‌నిర్మాతలు భావించారు. అందుకే ఈ పాట‌ను యాడ్ చేశార‌ని తెలుస్తోంది. నోరా ప‌థేహి త‌న‌దైన శైలి నృత్యాల‌తో ఇప్ప‌టికే బోలెడ‌న్ని సినిమాల‌కు ఊపిరి పోసింది. టెంప‌ర్‌ - కిక్‌ - బాహుబ‌లి - షేర్ సినిమాల్లో ఐటెమ్ నంబ‌ర్‌ తో అల‌రించిన ఈ భామ ప్ర‌స్తుతం లోఫ‌ర్ మూవీలోనూ ఐటెమ్ నంబ‌ర్‌ తో కిక్కెక్కించేందుకు రెడీ అవుతోంది. ఇప్పుడు నాగ్ - కార్తీ సినిమాకి ఊపిరి పోస్తోంద‌న్న‌మాట‌!