#మీటూ : తెలివిగా ప్రవర్తించిన స్టార్ హీరో!

Sun Nov 18 2018 07:00:01 GMT+0530 (IST)

బాలీవుడ్ లో మీటూ ఉద్యమం కుదుపు కుదిపేసింది. ఇప్పుడు కాస్త సైలెంట్ గా ఉన్నా కూడా గతంలో కొందరు చేసిన లైంగిక వేదింపుల ఆరోపణల తాలూకు ఇంకా వేడి కొనసాగుతూనే ఉంది. ఎంతో మంది సినీ కెరీర్ నాశనం అవ్వడంతో పాటు కొందరు అనధికారికంగా ఇండస్ట్రీ నుండి బహిష్కరణకు గురి అయ్యారు. మీటూ ఉద్యమం కారణంగా ‘హౌస్ ఫుల్ 4’ చిత్రం ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఇక ‘సూపర్ 30’ చిత్ర దర్శకుడు వికాస్ బహల్ కూడా ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో ఆ చిత్రం ఆగిపోతుందనే వార్తలు వచ్చాయి.



‘సూపర్ 30’ చిత్ర హీరో హృతిక్ రోషన్ చాలా తెలివిగా ఆలోచించాడు. దర్శకుడు వికాస్ బహల్ పై ఆరోపణలు వచ్చిన వెంటనే మిగిలి ఉన్న షూటింగ్ బ్యాలన్స్ పూర్తి చేయించాడట. షూటింగ్ పూర్తి అయిన తర్వాత తమ సినిమా నుండి వికాస్ బహల్ ను తొలగిస్తున్నట్లుగా ప్రకటించాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి అయ్యిందని ఇకపై సినిమాకు సంబంధించిన ఎలాంటి కార్యక్రమాల్లో ఆయన ఇన్వాల్వ్ మెంట్ ఉండదని హృతిక్ ప్రకటించాడు.

అయితే సినిమా టైటిల్ కార్డ్స్ లో మాత్రం వికాస్ బహల్ పేరు ఉంటుందని హృతిక్ పేర్కొన్నాడు. సినిమాకు సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాలు స్వయంగా నిర్మాణ సంస్థకు చెందిన ప్రతినిధులు మరియు కో డైరెక్టర్స్ చూసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. కాని సినీ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుసల ప్రచారం ఆ కార్యక్రమాలను కూడా వికాస్ బహల్ చూసుకుంటున్నాడని కాకుంటే హృతిక్ రోషన్ పరువు పోతుందనే ఉద్దేశ్యంతో వికాస్ ను దూరం పెట్టినట్లుగా పైకి కవరింగ్ ఇస్తున్నారు అంటూ కొందరు చెవులు కొరుక్కుంటున్నారు.