Begin typing your search above and press return to search.

తరుణ్ భాస్కర్ కహా గయా 'మిత్రోం'?

By:  Tupaki Desk   |   15 Aug 2018 11:54 AM GMT
తరుణ్ భాస్కర్ కహా గయా మిత్రోం?
X
రెండేళ్ళ క్రితం తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ - రితు వర్మ లు హీరో హీరోయిన్లు గా తెరకెక్కిన 'పెళ్లి చూపులు' బాక్స్ ఆఫీస్ వద్ద సర్ ప్రైజ్ హిట్ గా నిలిచింది. అంతే కాదు నేషనల్ అవార్డు కూడా సాధించింది. ఈ సినిమాను హిందీ లో 'మిత్రోం' పేరుతో రీమేక్ చేస్తున్నారు. జాకీ భగ్నాని - కృతిక కమ్రా ఈ సినిమాలో హీరో హీరోయిన్లు. నితిన్ కక్కర్ డైరెక్టర్. ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయింది. అందులో ఒక విషయం మాత్రం తెలుగు ఆడియన్స్ కు షాక్ ఇచ్చేలా ఉంది.

ట్రైలర్ ఎండ్ లో వచ్చిన టైటిల్ క్రెడిట్స్ లో ఎక్కడ కూడా తరుణ్ భాస్కర్ పేరు కనిపించలేదు. 'రిటెన్ బై షరిబ్ హష్మి'.. అని ఉంది. అంటే షరిబ్ హాష్మి గారు రాసినట్టు. మరి అయన స్టొరీ రాశాడో లేక తెలుగు నుండి హిందీ కి అనువాదం చేశాడో మాత్రం తెలీదు. రీమేక్ హక్కులు తీసుకున్నారు సరే గానీ 'మూలకథ' అనే టైటిల్ క్రెడిట్ అయినా ఒరిజినల్ రైటర్ కు ఇవ్వడం ఒక పద్దతి. కానీ అసలు ఆ హిందీ సినిమానే ఒరిజినల్ అనేలా తరుణ్ భాస్కర్ పేరు వేయకుండా ఉంటే ఎలా?

వాళ్ళు వేసినా వేయకపోయినా బాలీవుడ్ మీడియాలో ఇది తెలుగు సినిమా 'పెళ్లి చూపులు' రీమేక్ అని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ సినిమా సెప్టెంబర్ 14 న రిలీజ్ కానుంది. మరి సినిమా టైటిల్స్ లో అయినా తరుణ్ భాస్కర్ పేరు ను వేస్తారా లేదా అనేది వేచి చూడాలి.