Begin typing your search above and press return to search.

అనసూయకు విషయం అర్ధమైందో లేదో

By:  Tupaki Desk   |   27 Feb 2017 10:19 AM GMT
అనసూయకు విషయం అర్ధమైందో లేదో
X
సూయ సూయ అనసూయ అంటూ తన మీద ఒక పాట రాసేశారు కాబట్టి.. తాను ఈ సాంగ్ చేయడానికి ఒప్పుకున్నాను అంటూ ''విన్నర్'' సినిమా ప్రమోషన్ల టైములో అనసూయ చెప్పింది. అయితే కేవలం ఈ పాటను మాత్రమే వినేసి అసలు అనసూయ ఈ పాటను చేసేసింది కాని.. దాని వలన ఏదైనా నిజమైన ఉపయోగం ఉందా?

అత్తారింటికి దారేది సినిమాలో చేయనప్పుడు.. నాలో చాలా టెలెంట్ ఉందని.. అలాంటి టాలెంట్ బయటపడే అవకాశం కోసం వెయిట్ చేస్తున్నాని చెప్పింది. ఆ తరువాత క్షణం సినిమా చేసిన తరువాత.. నేనేంటే నేను చేసే సినిమా ఇలా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది. కాని అనూహ్యంగా ఆ తరువాత ఛాన్సులు ఏమీ రాలేదు. ఇక విన్నర్ సినిమా ఐటెం సాంగులో అన్ని విధాలుగా తాను గ్లామర్ దారబోయడానికి రెడీయే అన్నట్లు భారీగానే అందాలను ఆరబోసింది అనసూయ. కాని దీని వలన పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు.

ఒక ప్రక్కన భారీగా గ్లామర్ ఆరబోస్తున్న పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్లకే అసలు ఛాస్సులు సరిగ్గా రావట్లేదు. పోనివ్ ఐటెం బాంబులుగా డ్యాన్స్ అండ్ గ్లామర్ తో ఊర్రూతలూగిస్తున్న నోరా ఫతేహి వంటి ఫారిన్ బాంబులకు కూడా పాట హిట్టవకపోయినా.. సినిమా ఆడకపోయినా.. తరువాత సాంగులు రావట్లేదు. మరి హిట్టవ్వని పాటలో అంతగా ఆకట్టుకోని సినిమాలో విపరీతంగా ఆరబోసిన అనసూయకు ఏ మాత్రం హెల్ప్ అవుతుందో ఇక మనం చూసుకోవచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/