'వి' లో చేరిపోయిన నాని సుధీర్ లు

Wed Jun 12 2019 15:20:29 GMT+0530 (IST)

సున్నితమైన కథాంశాలతో సినిమాలు తీసే దర్శకుడిగా పేరున్న ఇంద్రగంటి మోహనకృష్ణ కొత్త మూవీ వి ఈ మధ్యే మొదలైన సంగతి తెల్సిందే. సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న విలో నాని ఓ కీలకమైన ప్రత్యేక పాత్రను చేయడం ఇప్పటికే టాక్ అఫ్ ది టౌన్ గా మారింది. హీరోగా డిమాండ్ పీక్స్ లో తరుణంలో నాని ఇలా స్పెషల్ రోల్ ఒప్పుకోవడం అంటే ఖచ్చితంగా ఆసక్తి రేపేదే. పూజా కార్యక్రమాల తర్వాత కొద్దిగా బ్రేక్ తీసుకున్న వి టీమ్ ఇవాళ్టి నుంచి సెట్స్ కు వెళ్తోంది.సుధీర్ బాబుతో నాని కూడా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. సో ఈ ఇద్దరి కాంబినేషన్ సీన్లు ఇందులో చిత్రీకరిస్తారన్న మాట. విశ్వసనీయ సమాచారం మేరకు ఇందులో సుధీర్ బాబు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడట. మరి నాని ఎవరు అనే డౌట్ వస్తోందిగా. అక్కడే ఉంది ట్విస్టు. చాలా పాజిటివ్ గా అనిపించే నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రనే నాని చేయబోతున్నట్టు తెలిసింది. సుధీర్ బాబు పాత్రకు నానికి ఉన్న కనెక్షన్ ఏంటో కూడా సస్పెన్సు గానే అనిపిస్తోంది.

అదితి రావు హైదరి హీరోయిన్ గా నటిస్తున్న వి జెంటిల్ మెన్ తరహాలో యాక్షన్ ప్లస్ ఎంటర్ టైన్మెంట్ సమపాళ్లలో ఉంటాయట. ఈ ఏడాది విడుదలకే గట్టి ప్లాన్ చేస్తున్న ఇంద్రగంటి ఒకవేళ అనుకున్న టైంకి ఇది ఫినిష్ చేయగలిగితే నవంబర్ లేదా డిసెంబర్ లో సినిమా రిలీజ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన క్లారిటీ ఇంకొద్ది రోజుల రావొచ్చు. జెర్సీలో ఎమోషనల్ ఫాదర్ గా కంటతడి పెట్టించిన నాని త్వరలో గ్యాంగ్ లీడర్ గా అవుట్ అండ్ అవుట్ కామెడీ చేయబోతున్నాడు. ఇప్పుడీ విలో ఇంకో డిఫరెంట్ రోల్. మొత్తానికి రొటీన్ కి భిన్నంగా నాని పరుగులు పెడుతున్నాడు