Begin typing your search above and press return to search.

ట్రైలర్ లేదేంటి గోవిందం?

By:  Tupaki Desk   |   15 Aug 2018 10:50 AM GMT
ట్రైలర్ లేదేంటి గోవిందం?
X
టాలీవుడ్ సెన్సేషన్ 'అర్జున్ రెడ్డి' తర్వాత విజయ్ దేవరకొండ సోలో హీరోగా నటించిన 'గీత గోవిందం' ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అడ్వాన్సు బుకింగ్స్ జోరుగా ఉంటే మౌత్ టాక్ - రివ్యూస్ పాజిటివ్ గా ఉన్నాయి. అసలే పోటీ కూడా లేదు కాబట్టి ఓపెనింగ్ కలెక్షన్స్ తో మన టాలీవుడ్ 'రౌడీ' హంగామా సృష్టించడం ఖాయం.

అంతా సూపర్ గా ఉంది గానీ మీరొక విషయం గమనించారా..? ఈ సినిమాకు అసలు ట్రైలరే రిలీజ్ చెయ్యలేదు. అయినా ఈ సినిమాకొచ్చిన ఇబ్బందేమీ లేదు. ఈ సినిమా ఇతర ప్రోమోలతో పాటు టీజర్ మాత్రమే రిలీజ్ అయింది. టాలీవుడ్ లో ఇలా జరగడం చాలా అరుదు. అసలెందుకు ట్రైలర్ రిలీజ్ కాలేదు? నిజానికి 'గీత గోవిందం' టీమ్ ట్రైలర్ ను రిలీజ్ చేయాలనే అనుకున్నారట. కానీ ఈ సినిమా పైరసీ కాపీలు బయటకు రావడంతో ఆ సమస్యను ఎదుర్కొనేందుకు టీమ్ అంతా పని చేయడం జరిగిందట. దీంతో ట్రైలర్ సంగతే పట్టించుకోలేదట. ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను కూడా క్యాన్సిల్ చేద్దామని అనుకున్నా ఆడియన్స్ - ఫ్యాన్స్ నిరాశచెందుతారని ఈవెంట్ ను జరిపారట.

ఇలా ఒక హైప్ ఉన్న సినిమా ట్రైలర్ లేకుండా రిలీజ్ కావడం ఈమధ్య ఒక 'కబాలి' విషయం లో నే జరిగింది. ఆ తర్వాత మన విజయ్ దేవరకొండ సినిమాకే ఆ ఘనత. ఆ విషయంలో మాత్రమే పోలిక సినిమా కంటెంట్ విషయంలో మాత్రం కాదు.. గుర్తించగలరని మనవి.