Begin typing your search above and press return to search.

సైరాకు సాహో టెన్షన్ ఉండదు

By:  Tupaki Desk   |   19 Aug 2019 3:30 PM GMT
సైరాకు సాహో టెన్షన్ ఉండదు
X
అతి తక్కువ వ్యవధిలో టాలీవుడ్ రెండు అతి పెద్ద విజువల్ వండర్స్ కు వేదికగా నిలవబోతున్న తరుణంలో సాహో సైరాల మీద అంచనాలు లెక్కలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఇంకో 11 రోజుల్లో విడుదల కానున్న సాహో కోసం ఇప్పటికే ఏర్పాట్లు చివరి దశకు వచ్చాయి. ప్రీమియర్లు బెనిఫిట్ షోల కోసం ప్రభుత్వాల అనుమతుల కోసం నిర్మాతలు ఇప్పటికే ప్రయత్నాల్లో ఉన్నట్టు టాక్ ఉంది.

ఇదిలా ఉండగా సాహో మీద సుమారు 200 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ జరుగుతున్నట్టుగా టాక్ ఉంది. అది కూడా ఒక్క సౌత్ నుంచే. ఇక నార్త్ తో పాటు ఓవర్సీస్ కలుపుకుంటే ఫిగర్స్ ఊహకందడం కూడా కష్టమే. ఓపెనింగ్స్ లోనూ స్క్రీన్ కౌంట్ లోనూ సాహో ఎలాంటి రికార్డులు సృష్టించబోతోందన్న దాని మీద ఇప్పటికే ట్రేడ్ రకరకాల విశ్లేషణల్లో మునిగిపోయింది. ఇప్పుడు సాహో సెట్ చేసే బెంచ్ మార్కే కేవలం 32 రోజుల గ్యాప్ తో వచ్చే సైరా నరసింహారెడ్డికు ఛాలెంజ్ గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు

అయితే సాహో ప్రభావం ఏ రకంగా సైరా మీద పడుతుందన్న దాని మీద కొన్ని మీడియా వర్గాల్లో కథనాలు వస్తున్నాయి. థియేటర్ల కౌంట్ గురించి ఓపెనింగ్స్ రోజు వచ్చే వసూళ్ల గురించి వివరిస్తూ సాహో వల్ల సైరా ఇబ్బంది పడుతుందన్న రీతిలో అవి ఉండటం చూసి మెగా ఫ్యాన్స్ కొంత ఆందోళన చెందుతున్నారు. ఇక్కడో విషయం మర్చిపోకూడదు. సాహో హిట్ అయినా కాకపోయినా దాని స్పాన్ నెల రోజుల కంటే మించి ఉండకపోవచ్చు.

బాహుబలి 2 లాంటి వేల కోట్లు వసూలు చేసిన సినిమానే ముప్పై రోజుల తర్వాత నెమ్మదించింది. స్క్రీన్లు కూడా తగ్గుతూ వచ్చాయి. అలాంటిది సాహో ఎంత గొప్పగా అద్భుతంగా ఉన్నా ఫస్ట్ వీక్ ఉన్నన్ని థియేటర్లలో కొనసాగడం అసాధ్యం. ఆ రకంగా చూస్తే సైరాకు ఆ గ్యాప్ చాలు. అక్టోబర్ 2 వచ్చే లోపు సాహో సందడి తగ్గిపోయి ఉంటుంది. సాహో ఇండస్ట్రీ హిట్ అయినా కూడా ట్రిపుల్ నెంబర్ ని మైంటైన్ చేస్తూ సైరాకు స్పేస్ వదిలేస్తుంది. అప్పటికి సైరా అంచనాలు హైప్ వేరుగా ఉంటాయి కాబట్టి ఎగ్జిబిటర్లు దీన్ని వేసేందుకు ఉత్సాహం చూపిస్తారు. సో సాహో వల్ల సైరాకు ఇబ్బందులు వస్తాయనే కామెంట్ గురించి అభిమానులు ఆందోళన చెందనక్కర్లేదు.