పవన్ తాపత్రయం.. నో సమ్మర్ బ్రేక్స్

Fri Apr 21 2017 13:50:30 GMT+0530 (IST)

పవన్ కల్యాణ్ అండ్ త్రివిక్రమ్.. ఈ కాంబినేషన్ మాయాజాలం తెలుగు అభిమానులుకు తారస్థాయిలో ఆనంధం ఇచ్చే ఒక కలయిక. మరి మళ్ళీ వీళ్ళు వస్తున్నారు అంటే దసరా పండుగే కదా. ఇప్పుడు కొన్ని సినిమాల షూటింగులు ఆపేసి చాలామంది సమ్మర్ హాలిడేస్ తీసుకుంటున్నారు. భానుడు  భగ భగ లకు షూటింగ్ ప్లాన్ మార్చుకొంటున్నారు. కానీ పవన్ త్రివిక్రమ్ లు మాత్రం చాలా దీక్షా గా షూటింగ్ లో నిమగ్నమై ఉన్నారు.

పవన్ కల్యాణ్ అయితే తన పూర్తి సమయాన్ని ఈ సినిమా పై పెడుతున్నాడు. షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఎట్టి పరిస్థితి లో ఈ సినిమా సెప్టెంబర్ కు విడుదలవ్వాలనే సంకల్పంతో అందరూ ఎండని కూడా లేక్కచేయటం లేదట. దసరా పండుగ కి మంచి ఉత్సవం జరపడానికి సిద్దం చేస్తున్నారు. పవన్ తన పొలిటికల్ కమిట్మెంట్స్ కూడా పక్కను పెట్టి మరీ ఈ షూటింగ్ ఫినిష్ చేస్తున్నాడు. నిజానికి ఈ సమ్మర్ లో ఎందుకు ఇంత తొందర పడుతున్నారు అంటే.. ఈ సినిమా పూర్తవ్వగానే ఈ ఏడాది ఇంకో సినిమా పట్టాలు ఎక్కించేయాలట. అందుకే ఇప్పుడు ఎండల్లో ఇంత తాపత్రాయపడుతోంది.

ఇకపోతే త్రివిక్రమ్ సినిమాలో పవన్ కు జతగా నేను శైలజ ఫేం కీర్తి సురేశ్ నటిస్తోంది. అలానే అను ఎమ్మానుయేల్ కూడా మనోడ్ని రొమాన్స్ చేస్తోంది. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు వినిపిస్తున్న రూమర్ల ప్రకారం సినిమాలో పవర్ స్టార్ట్ సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా దర్శనమిస్తాడని టాక్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/