Begin typing your search above and press return to search.

నాని హీరోయిన్ కి ఛాన్సుల్లేవ్

By:  Tupaki Desk   |   10 Sep 2019 3:30 AM GMT
నాని హీరోయిన్ కి ఛాన్సుల్లేవ్
X
ప్రతీ ఏడాది టాలీవుడ్ కి కొందరు కొత్త హీరోయిన్లు ఎగుమతి అవుతుంటారు. అందులో కొందరు మాత్రమే సక్సెస్ అయితే మిగతా వారు ఛాన్స్ ల్లేక ఇబ్బంది పడుతుంటారు. అయితే ఇప్పుడు నాని హీరోయిన్ కూడా టాలీవుడ్ లో ఆఫర్స్ లేక ఇబ్బంది పడుతుంది. ఈ ఏడాది నాని నటించిన 'జెర్సీ' తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది శ్రద్దా శ్రీనాథ్.

కన్నడలో హీరోయిన్ గా మంచి విజయాలు అందుకున్న ఈ భామ తమిళ్ లో కూడా సినిమాలు చేసినప్పటికీ ఈ ఏడాది టాలీవుడ్ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టింది. అయితే 'జెర్సీ' కంటే ముందే ఆదితో 'జోడి' సినిమా చేసింది. కానీ మొదటి సినిమా కంటే ముందే రెండో సినిమా విడుదలైంది. దాంతో ఈ అమ్మడికి తెలుగులో 'జెర్సీ' మొదటి సినిమా అయింది.

'జెర్సీ' తర్వాత తెలుగులో బిజీ అవ్వాలని భావించింది శ్రద్దా. కానీ ఆ సినిమాలో క్రెడిట్ అంతా నాని కే వెళ్ళింది. నటన పరంగా పరవాలేదు, కానీ ఎట్రాక్ట్ చేసే హీరోయిన్ కాదనే ఫీడ్ బ్యాక్ అందుకుంది. అందువల్ల ఈ అమ్మడికి 'జెర్సీ' తర్వాత తెలుగులో ఒక్క ఛాన్స్ కూడా రాలేదు. 'జోడీ' సినిమా అయినా తెలుగులో తనకి ఆఫర్స్ అందిస్తుందని ఆశిస్తే అది కాస్త బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అయితే ప్రస్తుతానికి శ్రద్దా కన్నడలో రెండు సినిమాలు తమిళ్ ఒకటి చేస్తుంది. మరి ఈ కన్నడ బ్యూటీకి తెలుగులో మళ్ళీ అవకాశం ఎప్పుడుస్తుందో..?