Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ దెబ్బతో ఏమీ మారలేదే

By:  Tupaki Desk   |   21 Nov 2017 11:30 PM GMT
బిగ్ బాస్ దెబ్బతో ఏమీ మారలేదే
X

ఒకప్పుడు ఐటెమ్ సాంగ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ముమైత్ ఏ స్థాయిలో డ్యాన్స్ చేసేదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోలందరి సినిమాల్లో అమ్మడు స్పెషల్ సాంగ్స్ ని చేసింది. ముమైత్ సాంగ్ లేనిదే కొందరు దర్శకులు సినిమాలను కూడా తీసేవారు. టాప్ దర్శకుల నుండి మీడియం దర్శకుల వరకు ముమైత్ స్పెషల్ సాంగ్స్ కోసం ప్రత్యేక సెట్స్ వేయించేవారు.

ఇక సంగీత దర్శకులు కూడా తామేమి తక్కువ కాదు అన్నట్టు ముమైత్ కోసం మంచి బాణీలను రెడీ చేసి హాట్ హాట్ గా స్టెప్పులు వేయించేవారు. మొత్తంగా ముమైత్ టాలీవుడ్ లో ఒక చక్రం తిప్పిందనే చెప్పాలి. కానీ రెగ్యులర్ హీరోయిన్స్ స్పెషల్ సాంగ్స్ చేస్తున్నారనో మరి విదేశీ భామల డామినేషనో తెలియదు గాని మొత్తానికి అవకాశాలు కనుమరుగైపోయాయి. చివరగా గత ఏడాది తిక్క - డిక్టేటర్ మూవీస్ లో ఐటెమ్ సాంగ్స్ చేసిన ముమైత్ ఈ ఏడాది ఒక్క అవకాశం కూడా దక్కించుకోలేదు.

కానీ బిగ్ బాస్ షోలో కనిపించి మెప్పించింది. అయితే ఆ షో తర్వాత అందులో ఉన్నవారు కొంచెం పాపులర్ అయ్యారు కానీ అవకాశాలు పెద్దగా అందుకోలేదు. ఇక అమ్మడిది కూడా కూడా అదే పరిస్థితి. బిగ్ బాస్ దెబ్బకు ఏమాత్రం ఫేటే మారలేదు. అయితే రీసెంట్ గా సీనియర్ తారలు నిర్వహించిన ఒక కార్యక్రమంలో ముమైత్ పాల్గొంది. సీనియర్ నటి గౌతమి జయసుధ వంటి వారు నెక్లెస్ రోడ్డులో నిర్వించిన ఆ విన్నర్స్ వాక్ లో పాల్గొన్నారు. మొత్తానికి ముమైత్ కి అవకాశాలు వస్తాయని అనుకుంటే.. వెండితెర మీద కాకుండా ఇలాంటి సామాజిక కార్యక్రమాలకు పిలుస్తున్నారు.