Begin typing your search above and press return to search.

మెగా ప్రిన్స్ సందడి లేదే ?

By:  Tupaki Desk   |   17 Dec 2018 8:09 AM GMT
మెగా ప్రిన్స్ సందడి లేదే ?
X
వరుణ్ తేజ్ హీరో గా ఘాజీ ఫేం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన అంతరిక్షం 9000 KMPH ఈ నెల 21 విడుదలవుతున్నసంగతి తెలిసిందే. తొలిప్రేమ లాంటి సూపర్ సక్సెస్ తర్వాత చేస్తున్న మూవీ కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. స్పేస్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీ ట్రైలర్ వచ్చాక హైప్ ఇంకాస్త పెరిగింది. అయితే ప్రమోషన్ విషయంలో టీం అంత ఉత్సాహంగా లేకపోవడం ఓపెనింగ్స్ ని ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదు. దానికి కారణాలు ఉన్నాయి. సక్సెస్ లో ఉన్న మెగా హీరో ప్లస్ జాతీయ అవార్డు దర్శకుడు తీసిన స్పేస్ మూవీ అనే రెండు అంశాలు తప్ప అంతరిక్షం గురించిన మరీ ఎక్కువ ప్లస్ పాయింట్స్ లేవు.

ఈ జానర్ అందరికి కనెక్ట్ అయ్యేది కాదు. టాక్ చాలా బాగుంది అంటే మాస్ కదులుతారు. ఈ నేపధ్యం లో పబ్లిక్ లోకి అంతరిక్షం థీమ్ ని తీసుకెళ్ళడం చాలా ముఖ్యం. రామ్ చరణ్ అతిది గా చేయబోయే ప్రీ రిలీజ్ గురించిన సోషల్ మీడియా పబ్లిసిటీ తప్ప ఇంకే హంగామా అంతరిక్షం వైపు నుంచి కనిపించడం లేదు. మరో వైపు శర్వానంద్ సాయిపల్లవిల పడి పడి లేచే మనసు ప్రమోషన్ విషయం లో చాలా స్పీడ్ గా ఉంది. ప్రీ రిలీజ్ కు పోటీగా అల్లు అర్జున్ ను తీసుకొస్తున్న టీం ఆడియో తో మొదటి సక్సెస్ ఇప్పటికే అందుకుంది. ఈ సినిమాకు శర్వా ఫాక్టర్ తో పాటు సాయి పల్లవి బ్రాండింగ్ పెద్ద ప్లస్ గా మారుతోంది.

అంతరిక్షంలో చేస్తున్న లావణ్య త్రిపాఠి సక్సెస్ ట్రాక్ లో లేదు. అదితి రావు హైదరి కు గుర్తింపు ఉంది ప్రత్యేకంగా జనాన్ని ఆకట్టుకునే క్రౌడ్ పుల్లర్ అయితే కాదు. ఎంత సేపు వరుణ్ తేజ్ సంకల్ప్ రెడ్డి బ్రాండ్ మీదే అంతరిక్షం జనాన్ని ఆకట్టుకోవాలి. అందుకే టైటిల్ లో ఉన్న తొమ్మిది వేల కిలోమీటర్ల వేగం బయట ప్రచారంలో మాత్రం కనిపించడం లేదు. నాలుగు రోజులే ఉన్న నేపథ్యం లో ఇకనైనా స్పీడ్ పెంచితే బెటరేమో