Begin typing your search above and press return to search.

టాలీవుడ్ కి హీరోయిన్ల కరువు!!

By:  Tupaki Desk   |   2 May 2016 7:29 AM GMT
టాలీవుడ్ కి హీరోయిన్ల కరువు!!
X
తెలుగు సినీ పరిశ్రమ ఇప్పుడు హీరోయిన్ల కొరతతో కొట్టుమిట్టాడుతోంది. రోజుకో హీరోయిన్ రంగప్రవేశం చేస్తున్న ఈ రోజుల్లో.. వయ్యారి భామలకు కరువేంటని అనిపిస్తుంది కానీ.. ఈ మాట వాస్తవమే. హీరోయిన్లు దొరక్క నిజంగానే ఇండస్ట్రీ అల్లాడుతోంది. పక్క భాషల్లో ఎవరన్నా కొత్త అమ్మాయిలు ఎవరన్నా వస్తున్నారేమో ఆశగా ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

హీరోయిన్ల కోసం ఎదురుచూడాల్సిన సిట్యుయేషన్ కొత్త హీరోలకు కాదు.. ఏకంగా బడా స్టార్స్ కే రావడం ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కత్తి రీమేక్ ని అఫీషియల్ గా స్టార్ట్ చేసేశారు. ఇందులో హీరోయిన్ ని ఇంకా ఫైనల్ చేయలేదు. అనుష్క - నయనతార అంటున్నారు కానీ.. ఇంకా ఏ విషయం తేలలేదు. ప్రస్తుతం బాహుబలి2 - భాగమతి లాంటి లేడీ ఓరియెంటెడ్ మూవీస్ అనుష్క బిజీగా ఉంటే.. కోలీవుడ్ సినిమాలతో ఊపిరి ఆడని పరిస్థితిలో నయనతార ఉంది.

చిరు 150వ సినిమాకే కాదు.. బాలకృష్ణ వందో సినిమాకి సేమ్ సిట్యుయేషన్. గౌతమీపుత్ర శాతకర్ణికి అన్నీ ఫైనల్ అయినా.. హీరోయిన్ ఎవరో తేలలేదు. బాలయ్య కోసం ఆ రెండు పేర్లతో పాటు కాజల్ పేరు కూడా వినిపించినా.. ఇంకా హీరోయిన్ ని ఫిక్స్ చేయలేదు. వెంకటేష్ ప్రస్తుతం నటిస్తున్న బాబు బంగారంలో నయన్ హీరోయిన్. మరో 2-3 సినిమాలను ఓకే చేసిన వెంకీ.. హీరోయిన్లను మాత్రం తేల్చుకోలేకపోతున్నాడు.

నాగార్జున ఓ నమో వేంకటేశా చిత్రంలో నటిస్తుండగా.. ఇందులో ప్రగ్యా ఒక్కతే ఫైనల్ అయింది. మరో హీరోయిన్ గా అనుష్కనే అడుగుతున్నారు. ఎస్ జే సూర్య దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా పరిస్థితి కూడా ఇంతే. మలయాళ హీరోయిన్ కోసం వెతుకులాడుతున్నారు. స్టార్ల పరిస్థితే ఇలా ఉంటే.. ఇక కొత్త, కుర్ర హీరోల పరిస్థితిలో కూడా ఏ మాత్రం తేడా లేదు. ఇండస్ట్రీకి ఇప్పుడు హీరోయిన్లు ఎంతగా అవసరమో ఈ పరిస్థితి అద్దం పడుతుంది.