Begin typing your search above and press return to search.

రియల్ పాలిటిక్స్ కు నో.. రీల్ పాలిటిక్స్ కు యస్!

By:  Tupaki Desk   |   19 Feb 2019 7:08 AM GMT
రియల్ పాలిటిక్స్ కు నో.. రీల్ పాలిటిక్స్ కు యస్!
X
పెద్ద పెద్ద స్టార్ హీరోలకు రెగ్యులర్ గా ఎదురయ్యే ప్రశ్నల్లో ఒకటి.. "మీకు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ ఉందా.. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే ఆలోచన ఉందా?" ఒకవేళ ఈ ప్రశ్నకు సమాధానం 'నో' అని ఆ స్టార్ హీరో చెప్తే.. "ఇప్పుడున్న పార్టీల్లో ఏ పార్టీకి మద్ధతిస్తారు?" అంటూ మరో ప్రశ్న అడుగుతారు. ఈ ప్రశ్నలు సూపర్ స్టార్ మహేష్ బాబును అడిగిన ప్రతి సారీ తన ఫోకస్ సినిమాలపైనేనని క్లారిటీ ఇచ్చాడు.

రీసెంట్ గా మహేష్ సతీమణి నమ్రతను ఇదే విషయంపై ప్రశ్నిస్తే "మహేష్ ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదని.. ఫలానా అభ్యర్థిని సమర్థించడం లాంటిది కూడా చేయడం లేదని" క్లారిటీ ఇచ్చారు. నిజ జీవితంలో రాజకీయాలకు ఆమడ దూరం ఉండే టాలీవుడ్ సూపర్ స్టార్ సినిమాల విషయం వచ్చేసరికి రాజకీయ నాయకుడిగా కనిపించేందుకు ఏమాత్రం వెనుకాడడు. 'దూకుడు' లో డూప్ ఎంఎల్ ఎ పాత్ర కానివ్వండి.. 'భరత్ అనే నేను' సినిమాలో నిజం సీఎమ్ పాత్ర కానివ్వండి.. దేనికైనా సైసై అంటాడు.

ప్రస్తుతం సెట్స్ పై ఉన్న మహేష్ బాబు తాజా చిత్రం 'మహర్షి' లో కూడా కాస్త పొలిటికల్ టచ్ ఉంటుందనే టాక్ ఉంది. అంటే.. మహేష్ రియల్ పాలిటిక్స్ కు 'నో' కానీ రీల్ పాలిటిక్స్ కు మాత్రం ఎప్పుడూ 'యస్' అన్నమాట. అయినా ఇప్పుడే పొలిటికల్ ఎంట్రీ గురించి చెప్పలేం.. నాన్నగారు కృష్ణ బాటలో ఫ్యూచర్ లో ఏమైనా రాజకీయ నాయకుడి అవతారం ఎత్తుతాడేమో.. ఏమో ఎవరికి తెలుసు?