Begin typing your search above and press return to search.

సాహో ఫస్ట్ లుక్ రావట్లేదు

By:  Tupaki Desk   |   20 April 2017 11:05 AM GMT
సాహో ఫస్ట్ లుక్ రావట్లేదు
X
బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా ‘సాహో’. ‘ది కంక్లూజన్’ ఇంటర్వెల్ టైంలో ‘సాహో’ ఫస్ట్ టీజర్ ప్రదర్శించబోతున్న సంగతి తెలిసిందే. అంతకంటే కొన్ని గంటల ముందు యూట్యూబ్‌ లో ఈ టీజర్ లాంచ్ అవుతుంది. ఐతే ఏదైనా కొత్త సినిమాకు సంబంధించి ఫస్ట్ టీజర్ కంటే ముందు ఫస్ట్ లుక్ లాంచ్ చేయడం ఆనవాయితీ. ‘సాహో’ విషయంలోనూ అలాగే చేయాలనుకున్నారు. ఈ ఆదివారం నాడు ఫస్ట్ లుక్ కోసం ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. దీని కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురు చూస్తుండగా. వాళ్ల ఆశలపై నీళ్లు చల్లేశారు. ఫస్ట్ లుక్ లాంచ్ కార్యక్రమాన్ని రద్దు చేసేశారన్నది తాజా సమాచారం.

అసలుకు ముందు ఈ కొసరెందుకని.. నేరుగా టీజర్ తోనే ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేయాలని ‘సాహో’ టీం నిర్ణయించుకుంది. కాబట్టి అభిమానులు కొంచెం ఓపిగ్గా టీజర్ కోసం ఎదురు చూడాల్సిందే. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా కావడంతో ‘సాహో’ మీద ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఏకంగా రూ.150 కోట్ల బడ్జెట్లో తెరకెక్కుతున్న సినిమా ఇది. అందుకు తగ్గట్లే టీజర్ ను చాలా రిచ్ గా ఉండేలా చూసుకుంటున్నాడట దర్శకుడు సుజీత్. ఇది జేమ్స్ బాండ్ తరహా యాక్షన్ ఎంటర్టైనర్ అంటున్నారు. టీజర్లో కూడా యాక్షన్ సన్నివేశాలే చూపిస్తారని అంటున్నారు. ప్రభాస్ మిత్రులైన వంశీ.. ప్రమోద్ ‘యువి క్రియేషన్స్’ బేనర్ మీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం.. హిందీ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/