Begin typing your search above and press return to search.

బాహుబలితో అసలు పోలికేల?

By:  Tupaki Desk   |   8 Nov 2018 5:17 AM GMT
బాహుబలితో అసలు పోలికేల?
X
మొత్తం భారతీయ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న రెండు సినిమాలు ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ముందుగా ఈ రోజు ఆమిర్ ఖాన్ సినిమా ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ రిలీజవుతుండగా.. నెలాఖర్లో సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ ‘2.0’ విడుదలవుతోంది. ఈ రెండు సినిమాల మీదా అంచనాలు భారీగా ఉన్నాయి. కలెక్షన్లతో ‘బాహుబలి’కి దీటుగా నిలవగల సినిమాలు ఇవే అని భావిస్తున్నారు. రాజమౌళి విజువల్ వండర్ వసూళ్లను ఇవి అధిగమిస్తాయా లేదా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొన్ని రోజులుగా దీని గురించే చర్చ జరుగుతోంది. ఐతే ‘బాహుబలి-2’ రిలీజ్ తర్వాత ఇండియాలో ఏ భారీ సినిమా వచ్చినా.. దాని రికార్డులు బద్దలు కొడుతుందా లేదా అని చూడటం మామూలైపోయింది. అందులోనూ అమీర్ ఖాన్.. రజనీకాంత్ ల బాక్సాఫీస్ స్టామినా.. వీళ్లు ఇప్పుడు చేసిన సినిమాలపై ఉన్న అంచనాల ప్రకారం ఈ చర్చ పెరుగుతోంది. ఇది ఆయా చిత్ర బృందాలపై ఒత్తిడి పెంచుతోంది. కానీ ఏ సినిమానైనా సరే.. ‘బాహుబలి’తో పోల్చడం సమంజసమేనా అన్నది ప్రశ్న.

‘బాహుబలి’ అనేది ఒక మ్యాజిక్. ఆ సినిమాకు అలాంటి క్రేజ్ వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. అందులోనూ ‘బాహుబలి: ది కంక్లూజన్’కి వచ్చిన హైప్ అసాధారణం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ సినిమా క్రేజ్ సంపాదించుకుంది. అదేదీ ప్లాన్ చేస్తే వచ్చింది కాదు. అనుకోకుండా.. ఎవ్వరూ ఊహించని స్థాయిలో దానంతటదే హైప్ వచ్చేసింది. ఇలా భవిష్యత్తులో అయినా ఇంకే సినిమాకూ ఇలా జరగడం కష్టమే. రాజమౌళి సైతం ఇంకోసారి ఈ తరహా సినిమా చేసినా ఈ హైప్ రావడం కష్టం. కాబట్టి ఇప్పుడిప్పుడే ‘బాహుబలి’ రికార్డులు బద్దలవుతాయా అన్నది సందేహమే. భవిష్యత్తులో థియేటర్ల సంఖ్య - టికెట్ల రేట్లు పెరగడం.. మరికొన్ని అంశాలు కలిసొచ్చి ఈ వసూళ్లను మరో సినిమా దాటినా.. ఆ స్థాయి హైప్.. దక్షిణాది-ఉత్తరాది అనే భేదాలేమీ లేకుండా అందరి ఆమోదం పొందడం మాత్రం దాదాపు అసాధ్యమే.