Begin typing your search above and press return to search.

చిరును పవన్ ఎక్కడ కలిశాడబ్బా!?

By:  Tupaki Desk   |   20 Jan 2017 10:30 AM GMT
చిరును పవన్ ఎక్కడ కలిశాడబ్బా!?
X
మెగాస్టార్ చిరంజీవిని తమ్ముడు పవన్ కళ్యాణ్ కలిశాడన్నది లేటెస్ట్ న్యూస్. చిరు ఇంటికి పవన్ వెళ్లాడని.. ఖైదీ నంబర్ 150 సక్సెస్ నుంచి.. రాజకీయాల వరకూ మాట్లాడుకున్నారని.. గంటల పాటు కూర్చుని చర్చించుకున్నారని.. వదినమ్మతో పవన్ బోలెడన్ని కబుర్లు చెప్పాడని.. నిర్మాతగా తొలి ప్రయత్నంలోనే సక్సెస్ సాధించినందుకు పవన్ అభినందించాడని.. ఇలా చాలానే టాక్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ పవన్ అసలు చిరంజీవిని ఎక్కడ కలిశాడు.. ఎప్పుడు కలిశాడు అంటూ సందేహం కూడా ఒకటి కొందరికి వచ్చింది.

చిరంజీవి ఇంటికి పవన్ వెళ్లడం అనేది జరగలేదు.. కాకపోతే పార్టీలో కలిశాడు అంటున్నారు ఫిలిం నగర్ వర్గాలు. ఆయన అన్నయ్యను అక్కడ కలవలేదు. చిరంజీవి రీఎంట్రీ ఘనంగా జరగడం.. ఖైదీ నంబర్ 150తో బ్లాక్ బస్టర్ సాధించి.. తన స్థాయిని స్థానాన్ని చాటిచెప్పడంపై.. ఎంపి సుబ్బిరామిరెడ్డి ఒక పెద్ద పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి టాలీవుడ్ నుంచి చాలామంది ప్రముఖులు హాజరయ్యారని తెలుస్తోంది. నాగార్జున సహా చాలామందే ఈ పార్టీకి హాజరయ్యారు. కాగా పవన్ కూడా ఈ పార్టీలోనే చిరంజీవిని కలిసుండుంటాడేమో అనే టాక్ వినిపిస్తోంది. కాకపోతే ఈ పార్టీకి సంబంధించి ఎటువంటి ఫోటోలు కూడా బయటకు రాలేదు కాబట్టి.. అసలు ఏం జరిగి ఉంటుంది అనేది మాత్రం ఎవ్వరికీ తెలియదనే చెప్పాలి.

ఏదేమైనా కూడా అసలు మెగాస్టార్ అండ్ పవర్ స్టార్ మీటింగ్ జరిగిందా లేదా అనే విషయంపై క్లారిటీ మిస్సింగ్ అని కొందరు అంటుంటే.. ఇంటికెళ్ళి పవన్ కలిసే ఉంటాడులే .. లేకపోతే అసలు ఈ న్యూస్ ఎలా బయటకు పొక్కుతుంది అంటూ మెగా వర్గాలు అంటున్నారు. అది సంగతి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/